
చిరంజీవి
బ్రిటిషర్స్‌తో ఏకధాటి పోరాటానికి తన సైన్యాన్ని సిద్ధం చేస్తున్నారు నరసింహా రెడ్డి. నెల రోజుల పాటు విరామం లేకుండా ఈ పోరాటం సాగనుందట. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి హీరోగా స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతోన్న చిత్రం ‘సైరా’. రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నయనతార, తమన్నా కథానాయికలు.
ఈ సినిమా కొత్త షెడ్యూల్ రేపటి నుంచి స్టార్ట్ కానుంది. ప్రత్యేకంగా రూపొందించిన సెట్లో సెప్టెంబర్ మొదటి వారం వరకూ చిత్రీకరణ జరగనుంది. ముఖ్యంగా బ్రిటిషర్స్, నరసింహారెడ్డి మధ్య సాగే సన్నివేశాలు, ఫైట్స్ చిత్రీకరిస్తారని సమాచారం. ఆగస్ట్ 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ‘సైరా’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయనున్న సంగతి తెలిసిందే. అమితాబ్ బచ్చన్, జగపతి బాబు, సుదీప్, విజయ్ సేతుపతి కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ చిత్రానికి సంగీతం: అమిత్ త్రివేది, కెమెరా: రత్నవేలు.