
తాప్సీ పిచ్చ హ్యాపీ
ముంబై: బాలీవుడ్ సినిమా ‘పింక్’ ట్రైలర్ కు ప్రశంసలు దక్కడం పట్ల హీరోయిన్ తాప్సీ సంతోషం వ్యక్తం చేసింది. ఆగస్టు 9 విడుదల చేసిన ‘పింక్’ ట్రైలర్ ను యూట్యూబ్ లో 61 లక్షల మందిపైగా చూశారు.
'నేను ప్రస్తుతం విదేశాల్లో ఉన్నాను. పింక్ సినిమా ట్రైలర్ కు అనూహ్య స్పందన రావడం ఎంతో సంతోషం కలిగించింది. ట్రైలర్ ను చూసి ఈ సినిమాను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. మా ప్రయత్నం విజయవంతం కాబోతుంద'ని తాప్సీ ఆశాభావం వ్యక్తం చేసింది.
క్రిమినల్ కేసులో ఇరుక్కున్న ముగ్గురు యువతులు చేసిన న్యాయపోరాటం నేపథ్యంలో 'పింక్' సినిమా తెరెకెక్కింది. సుజిత్ సర్కార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, తాప్సీ, కీర్తి కుల్హరి, ఆండ్రియా తారింగ్ ముఖ్యపాత్రల్లో నటించారు. సెప్టెంబర్ 16న ఈ సినిమా విడుదలకానుంది.