'మీ తప్పుడు చూపులు మార్చుకోండి' | taapsee pannu fires on tamil fans | Sakshi
Sakshi News home page

ముందు మీ తప్పుడు చూపులు మార్చుకోండి : తాప్సీ

Published Tue, Nov 21 2017 5:23 PM | Last Updated on Mon, Oct 22 2018 6:05 PM

taapsee pannu fires on tamil fans - Sakshi - Sakshi

సాక్షి, చెన్నై: వెట్రిమారన్‌ దర్శకత్వంలో ధనుష్‌ నటించిన ఆడుగళం చిత్రంతో కోలీవుడ్‌లోకి అడుగుపెట్టిన బ్యూటీ తాప్సీ. ఆ తర్వాత పలు తమిళ చిత్రాల్లో నటించినా ఈ అమ్మడుకి ఆశించినంత అవకాశాలు, విజయాలు అందలేదు. దీంతో తెలుగు, హిందీ చిత్రాలపై దృష్టి సారించి అక్కడ వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. అదే సమయంలో తాను నటిస్తున్న సినిమాల్లోని గ్లామర్‌, ఫొటోలను అప్పుడప్పుడు సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేస్తూ అభిమానులను, నెటిజన్లను అలరిస్తోంది.

దీనిపై తెలుగు, హిందీ అభిమానుల నుంచి మంచి స్పందన వస్తుంటే తమిళ అభిమానులు మాత్రం అందుకు భిన్నాభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాప్సీ తాజాగా విడుదల చేసిన ఫొటోలను చూసిన తమిళ తంబీలు తాప్సీని ఘాటుగానే విమర్శించారు. అరకొర దుస్తులు ధరిస్తున్నందునే పురుషులు మహిళలను తప్పుడు చూపులతో చూస్తున్నారని దుయ్యబట్టారు. డబ్బు కోసమే ఈ విధంగా నటిస్తున్నారంటూ తాప్సీపై మండి పడ్డారు. 

అయితే వారి విమర్శలకు తాప్సీ ఘాటుగానే స్పందించింది. మీరంతా ఉత్తములైతే ఎందుకు తప్పుడు భావనతో చూస్తున్నారని ప్రశ్నించింది. ఎదుటి వారిని విమర్శించే ముందు మీ చూపులు మార్చుకోండి అంటూ తమిళ తంబిలకు ఉచిత సలహాలు ఇచ్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement