
‘ఎవరి మనోభావాలైనా దెబ్బతీసేలా ఉండాలని ఏనాడు అనుకోలేదు. నాకు తెలియకుండా ఎవరినైనా ఇబ్బంది పెట్టినట్లయితే దయచేసి నన్ను క్షమించండి. ప్రతీ ఒక్కరి హృదయం ప్రేమ, శాంతి భావనలతో నిండిపోవాలి అంటూ బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా భార్య, ఫిల్మ్‌మేకర్ తహీరా కశ్యప్ నెటిజన్లకు క్షమాపణలు చెప్పారు. బుద్ధుడిని అగౌరవ పరిచే రీతిలో ఉన్న తన ఫొటోను ఇన్‌స్టా అకౌంట్ నుంచి తొలగించారు. బ్రెస్ట్ క్యాన్సర్‌తో బాధ పడుతున్న తహీరా.. ప్రస్తుతం కీమో థెరఫీ చేయించుకుంటున్న సంగతి తెలిసిందే. ఇంతటి అనారోగ్యంలో కూడా తన కుటుంబం, కెరీర్ పట్ల ఆమె ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇటీవలే తన మరిదిని హీరోగా పెట్టి.. మ్యూజిక్ ఆల్బమ్‌ను తెరకెక్కించిన తహీరా డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ సక్సెన్‌ను ఎంజాయ్ చేస్తూ తన పిల్లలు, స్నేహితురాలితో పుణె ట్రిప్‌కు వెళ్లారు.
ఈ క్రమంలో మంగళవారం బుద్ధ పూర్ణిమ సందర్భంగా.. బుద్ధుడి విగ్రహంపై కూర్చుని ఫొటోలకు ఫోజులిచ్చారు. వీటిని సోషల్‌మీడియాలో షేర్ చేయగా నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో తన ఫొటోలను డెలీట్ చేసిన తహీరా.. క్షమాపణలు కోరారు. అదేవిధంగా తన పిల్లలు, స్నేహితురాలితో కలిసి ప్రకృతి ఒడిలో సేద తీరానంటూ ట్రిప్ తాలూకు అనుభవాల గురించి సోషల్ మీడియాలో చెప్పుకొచ్చారు. కాగా 2011లో తన స్నేహితుడు ఆయుష్మాన్ ఖురానాను పెళ్లాడిన తహీరాకు ఒక కుమార్తె, కుమారుడు ఉన్న సంగతి తెలిసిందే. ఇక రియాలిటీ షోలు, టీవీ షోలు, రేడియో జాకీగా పని చేసిన ఆయుష్మాన్ ‘విక్కీ డోనర్’ సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం వరుస సక్సెస్‌లతో దూకుడు మీద ఉన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment