బాహుబలి నా క్రేజ్ను మరింత పెంచింది | Tamanna Launch Shopping Mall in khammam | Sakshi
Sakshi News home page

బాహుబలి నా క్రేజ్ను మరింత పెంచింది

Published Fri, Oct 16 2015 8:26 PM | Last Updated on Sun, Sep 3 2017 11:04 AM

బాహుబలి నా క్రేజ్ను మరింత పెంచింది

బాహుబలి నా క్రేజ్ను మరింత పెంచింది

ఖమ్మం : బాహుబలి చిత్రం తన క్రేజ్ను మరింత పెంచిందని మిల్కీ బ్యూటీ తమన్నా తెలిపింది. ప్రతి మనిషికీ ఓ డ్రీమ్ ఉంటుందని, అది తనకు కూడా ఉందని ఆమె చెప్పింది. బాహుబలిలో నటించే వరకు తనకూ ఓ డ్రీమ్ ఉండేదని తమన్నా చెప్పుకొచ్చింది.   అయితే  బాహుబలి సినిమాలో లీడ్ రోల్ ద్వారా రాజమౌళి  మంచి అవకాశం ఇచ్చి తన స్థాయిని, క్రేజ్‌ను పెంచారని తెలిపింది. దీంతో తన డ్రీమ్.. బాహుబలిలో వచ్చిన క్రేజ్ ముందు చిన్నబోయిందని, అందుకే ప్రస్తుతం తన డ్రీమ్ రోల్ మార్చుకోవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పింది.

తమన్నా శుక్రవారం ఖమ్మంలో ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్కు  విచ్చేసింది.  ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ ప్రస్తుతానికి సినిమా షూటింగ్‌లతో బిజీబిజీగా గడుపుతున్నానని,  త్వరలోనే తన డ్రీమ్ రోల్ ఏంటో నిర్దేశించుకుని దాని కోసం కృషి చేస్తానని తెలిపింది.  తాను ముంబయిలో పుట్టి పెరిగినా, తెలుగు భాష, ఇక్కడ ప్రజలంతే చాలా ఇష్టమని చెప్పింది.

ప్రస్తుతానికి తమిళంలో 'తోడా'  సినిమా, తెలుగులో రవితేజ హీరోగా బెంగాల్ టైగర్‌తో పాటు కార్తీక్,నాగ్ ప్రధాన పాత్రల్లో ఊపిరి సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్నట్లు తమన్నా వెల్లడించింది. మరో తెలుగు సినిమాలో నటించడానికి ఇటీవలే ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆమె పేర్కొంది. ఆ కార్యక్రమం అనంతరం తమన్నా బతుకమ్మను ఎత్తుకుని ఫొటోలకు ఫోజులు ఇస్తూ కాసేపు అభిమానుల సమక్షంలో సందడి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement