
వీకెండ్‌లో కింగ్ నాగార్జున గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చి హౌస్‌మేట్స్‌తో పాటు ఆడియెన్స్‌ను ఎంటర్‌టైన్ చేశాడు. మొదటి వారానికి గానూ నామినేషన్‌లో ఉన్న ఆరుగురు కంటెస్టెంట్లలో హిమజ, పునర్నవి సేఫ్ అయినట్లు.. రాహుల్, జాఫర్, వితికా, హేమలు ఎలిమినేషన్ డేంజర్ జోన్‌లో ఉన్నట్లు నాగ్ తెలిపాడు. ఇప్పటికే అందిన రిపోర్టుల ప్రకారం హేమ ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. దీనికి తోడు సోషల్ మీడియాలోకూడా ఇదే ట్రెండ్ అవుతోంది. దీంతో హేమను బయటకు పంపించేసి.. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా మరో సెలబ్రెటీని హౌస్‌లోకి పంపించనున్నుట్లు తెలుస్తోంది.
ట్రాన్స్‌జెండర్ తమన్నా సింహాద్రి పేరు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారం, నారా లోకేష్ విషయంలో తమన్నాకు ఒక్కసారిగా ఫేమ్ వచ్చేసింది. ప్రస్తుతం ఈమెను వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్‌బాస్ ఇంట్లోకి ప్రవేశించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీకెండ్‌లో వచ్చిన నాగ్.. ఇంటి సభ్యులతో పాటు ఆడియెన్స్ ఆకట్టుకున్నాడు. ఆదివారం సైతం నాగ్.. ఇంటి సభ్యులతో ఆడిపాడించినట్లు ప్రోమోల ద్వారా తెలుస్తోంది. మరి అందరూ భావిస్తున్నట్లు హేమ బయటకు వెళ్లడం.. వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ద్వారా తమన్నా సింహాద్రి హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తారో లేదో తెలియాలంటే ఆదివారం రాత్రి వరకు ఆగాల్సిందే.
Hema is eliminated from BB3
— Karthik Reddy 🎬 (@Karthikpuri) July 28, 2019
And the latest news is Tamanna Simhadri (don't know who she is) makes wild card entry#hema #BiggBossTelugu3
#BiggBossTelugu3#Hema OUT. Transwoman #ThammanahSimhadri Wild Card Entry. 👍
— 💥Muralidhar K💥 (@muralia22) July 27, 2019
Bye Bye #Hema Aunty😁🙏👋 #Elimination & Welcome Thamanna Simhadri (Transgender) #WildcardEntry #BiggBossTelugu3 #Nagarjuna #bigbosstelugu3 #BiggBoss3 #BiggBoss #BigBoss #SundayFunday
— Cinema Freak (@love__cinema) July 27, 2019
చదవండి : బిగ్‌బాస్.. హేమ అవుట్!