
బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలేకు పలువురు సెలబ్రిటీలు కదిలి వచ్చారు. వారి అందచందాలు, ఆటపాటలతో స్టేజ్‌ను ఊపేయనున్నారు. సినీ తారలు అంజలి, క్యాథరిన్, రాశి ఖన్నా గ్రాండ్ ఫినాలేకు విచ్చేసి సందడి చేశారు. రాశిఖన్నా ఏకంగా బిగ్‌బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టి ఇంటి సభ్యులకు సర్‌ప్రైజ్ ఇచ్చింది. అనంతరం హౌస్‌మేట్స్‌తో కలిసి స్టెప్పులేసింది. ఇస్మార్ట్ హీరోయిన్ నిధి అగర్వాల్ డాన్సులు, అనురాగ్ కులకర్ణి పాడిన ‘రాములో రాములా..’ పాటతో స్టేజీ హోరెత్తిపోతున్నట్లు కనిపిస్తోంది. దీంతో నేటి ఎపిసోడ్ టన్నుల కొద్దీ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వనున్నట్లు కనిపిస్తోంది. హీరో శ్రీకాంత్ తనకు పునర్నవి ఇష్టమైన కంటెస్టెంట్ అని చెప్పడంతో ఆమె సిగ్గులు ఒలకబోసింది.
ఇక బిగ్‌బాస్ ఫైనల్ ఎపిసోడ్‌కు తారలతోపాటు ఇంటి సభ్యుల కుటుంబాలు కూడా విచ్చేశాయి. ఇక బిగ్‌బాస్‌ను ఇంటికి రమ్మన్న క్రేజీ బామ్మ హైలెట్‌గా నిలుస్తోంది. ఆమె మాటలకు ముగ్ధుడైపోయిన నాగార్జున బామ్మకు లవ్యూ చెప్పాడు. వచ్చిన సెలబ్రిటీలు టాప్ 5 కంటెస్టెంట్లను ఒక్కొక్కరిగా ఎలిమినేట్ చేయనున్నారు. చివరగా మిగిలే ఇద్దరిలో విజేత ఎవరనేది ప్రత్యేక అతిథి ప్రకటిస్తాడు. ఆ స్పెషల్ గెస్ట్ మెగాస్టార్ చిరంజీవి అని టాక్. ఇక ఇంటి సభ్యులను ఎలిమినేట్ చేయాల్సిన బాధ్యతను నాగ్.. అంజలి, రాశి ఖన్నాకు అప్పగించాడు. మరి ఈ ఇద్దరు హీరోయిన్లు ఎవర్ని ఎలిమినేట్ చేయనున్నారనేది ఆసక్తికరంగా మారింది. మొదటగా ఇంటి నుంచి అలీ ఎలిమినేట్ అయ్యాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. అది ఎంతవరకు నిజమనేది మరికొద్ది గంటల్లో తేలనుంది.
Are you ready to watch the GRAND FINALE of #BiggBossTelugu3?? .. Sunday evening is going to be too much fun with many more surprises!!! #BB3TeluguFinale
— STAR MAA (@StarMaa) November 3, 2019
Starts today at 6 PM on Star Maa pic.twitter.com/5BLKsfg3CS