
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన చారిత్రక చిత్రం సైరా నరసింహారెడ్డి. తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యలవాడ కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తాజాగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బుధవారం సైరా చిత్రాన్ని వీక్షించారు. తమిళిసై కోసం చిరంజీవి ప్రత్యేక షో ఏర్పాటు చేశారు. గవర్నర్‌తోపాటు ఆమె కుటుంబ సభ్యులు, చిరంజీవి కుమార్తె సుష్మిత కూడా ఉన్నారు. అనంతరం ఈ చిత్రానికి పనిచేసిన బృందాన్ని తమిళిసై అభినందించారు. ఈ చిత్రం తనకు బాగా నచ్చిందని ఆమె పేర్కొన్నారు. కాగా, శనివారం రోజున గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన చిరంజీవి.. సైరా చిత్రం చూడాల్సిందిగా ఆహ్వానించిన సంగతి తెలిసిందే.
ఈనెల 2న విడుదలైన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బిగ్ బీ అమితాబ్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, అనుష్క, తమన్నా, నయనతారలాంటి ప్రముఖులు నటించారు. రామ్‌చరణ్ ఈ చిత్రాన్ని నిర్మించాడు.
Comments
Please login to add a commentAdd a comment