కరోనా కష్టకాలంలో సినీ కార్మికులను ఆదుకునేందుకు టాలీవుడ్ పర్రముఖులందరి నుంచి విరాళాలు సేకరించి కరోనా క్రైసిస్ ఛారిటీ(సీసీసీ)ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీని ద్వారా గతేడాది లాక్‌డౌన్‌లో సమయంలో సినీ కార్మికులకు నిత్యావసరాలు అందించారు.మెగాస్టార్ చిరంజీవి పర్యవేక్షణలో సాగిన సీసీసీ ఇప్పుడు మరో బృహత్ కార్యానికి నడుం బిగించింది. సినీ పరిశ్రమలో 45ఏళ్లు దాటిన కార్మికులందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందించనున్నట్లు చిరంజీవి ప్రకటించారు.
గత ఏడాది వసూలు అయిన విరాళాలలో కొంత మొత్తం ఈ ఛారిటీ సంస్థలో ఉంది. ఆ డబ్బుతోనే గురువారం ఉదయం నుంచి వాక్సినేషన్ ప్రక్రియ చేపట్టారు. అపోలో హాస్పిటల్ నేతృత్వంలో ఈ కార్యక్రమం సాగుతుంది. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చిరంజీవిపై ప్రశంసలు జల్లు కురిపించారు.
‘తెలుగు సినీ దిగ్గజ నటుడు చిరంజీవి గారు కరోనా క్రైసిస్ చారిటీ ద్వారా అపోలో సహకారం తో సినీ కార్మికులు, సినీ జర్నలిస్ట్ లకు ఉచిత వ్యాక్సినేషన్ ఇవ్వడానికి ముందుకు రావడం అభినందనీయం. ఇది ఒక మంచి ప్రయత్నం’ అని గవర్నర్ తమిళిసై ట్వీట్ చేశారు.
చదవండి:
కరోనాతో డ్రైవర్ మృతి.. టెన్షన్‌లో మెగా ఫ్యామిలీ!
కల్యాణ్‌దేవ్‌కు కరోనా.. ఆసుపత్రిలో చేరిన నటుడు
Comments
Please login to add a commentAdd a comment