నా పాత్ర ఓ సర్ప్రైజ్..
నీళ్లు ఎక్కడ దొరుకుతాయో చెప్పగలిగే యువకుడు ఓ గ్రామానికి ఎలా సాయం చేశాడు? అనే కథాంశంతో రూపొందిన హిందీ చిత్రం ‘జల్’. ఇందులో నటించిన తనిష్టా చటర్జీ ఓ హాలీవుడ్ చిత్రంలో చాన్స్ కొట్టేశారు. ఈ చిత్రంలో తన పాత్ర సర్ప్రైజ్ ఇస్తుందనీ, చాలా కీలకమైనదనీ తనిష్టా పేర్కొన్నారు. హాలీవుడ్ చిత్రంలో అవకాశం కొట్టేసినందుకు ఆమె ఆనందం వ్యక్తం చేశారు. తల్లి నుంచి తప్పిపోయిన ఓ కుర్రాణ్ని ఆస్ట్రేలియన్ దంపతులు దత్తత తీసుకునే నిజజీవిత కథతో ఈ చిత్రం రూపొందనుంది. ఆస్ట్రేలియా వ్యాపారవేత్త సరూ బ్రీరర్లీ రచించిన ‘ఏ లాంగ్ వే హోమ్’ నవలకు ‘లయన్’ చిత్రం ద్వారా తెరరూపం ఇవ్వనున్నారు. గార్త్ డేవిస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.