పెళ్లికొడుకవుతున్న రాజా | Telugu actor Raja to get married | Sakshi
Sakshi News home page

పెళ్లికొడుకవుతున్న రాజా

Published Tue, Jan 28 2014 1:45 AM | Last Updated on Sat, Sep 2 2017 3:04 AM

పెళ్లికొడుకవుతున్న రాజా

పెళ్లికొడుకవుతున్న రాజా

ఆనంద్ ఒక మంచి కాఫీలాంటి సినిమా అంటూ టాలీవుడ్ ప్రేక్షకులకు తీయని అనుభవాన్నిచ్చిన రాజా ఆ తరువాత మాయాబజార్,

 ఆనంద్ ఒక మంచి కాఫీలాంటి సినిమా అంటూ టాలీవుడ్ ప్రేక్షకులకు తీయని అనుభవాన్నిచ్చిన రాజా ఆ తరువాత మాయాబజార్, మిస్టర్ మేధావి, మొగుడు పెళ్లాం ఓ దొంగోడు లాంటి చిత్రాల్లో నటించారు. రాజా జగన్మోహిని, కన్నా వంటి చిత్రాల ద్వారా తమిళ ప్రేక్షకులకు సుపరిచితుడే. ఈ యువ నటుడు ఇప్పుడు పెళ్లికొడుకు అవుతున్నారు. చెన్నైకి చెందిన వ్యాపార వేత్త కూతురితో పెళ్లి పీటలెక్కడానికి సిద్ధం అవుతన్నారు. ఈ వధువు పేరు అమృత. వీరి వివాహ నిశ్చితార్థం మార్చిలో, పాణిగ్రహం ఏప్రిల్ లో చెన్నైలో జరగనుంది. వివాహ రిసెప్షన్ హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. తమది పెద్దలు నిశ్చయించిన పెళ్లంటూ కాబోయే వధూవరులే ఒక ప్రకటన విడుదల చేయడం గమనార్హం. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement