గ్లిట్టర్స్ ఫిల్మ్ అకాడమీ బ్యానర్‌పై గతంలో ‘బమ్ ధమ్’ చిత్రాన్ని నిర్మించిన దీపక్ బల్‌దేవ్ తొలి ప్రయత్నంగా ‘ఫుల్ మూన్’ అనే చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ప్రకాష్ ఠాకూర్ సమర్పణలో గ్లిట్టర్స్ బ్యానర్‌పై తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ‘బ్యాడ్ డెసిషన్స్ మేక్ బెటర్ స్టోరీస్’ అనేది ఉపశీర్షిక. దీపక్ బల్‌దేవ్ మాట్లాడుతూ - ‘‘మంచి కథ, కథనంతో ఈ చిత్రాన్ని నిర్మించనున్నాం.
రెగ్యులర్ షూటింగ్ ఈ నెలాఖరు నుంచి డెహ్రడూన్, సిమ్లా, కసోల్‌లలో జరుగుతుంది. మూడు జంటల కథతో తెరకెక్కనున్న ఈ చిత్రంలో కెనడాకి చెందిన షీక అనే అమ్మాయి ఓ కథానాయికగా నటించనుంది’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: అభిలాష్.
మూడు జంటల కథ
Published Sun, Nov 15 2015 11:22 PM | Last Updated on Sun, Sep 3 2017 12:32 PM
Advertisement
Advertisement