రేపే హీరో నిఖిల్‌-పల్లవి వివాహం? | Tollywood Hero Nikhil Pallavi Marriage Date Confirmed | Sakshi
Sakshi News home page

అనుకున్న ముహూర్తానికే నిఖిల్‌ పెళ్లి?

Published Wed, May 13 2020 2:14 PM | Last Updated on Wed, May 13 2020 3:11 PM

Tollywood Hero Nikhil Pallavi Marriage Date Confirmed - Sakshi

కరోనా లాక్‌డౌన్‌ కారణంగా టాలీవుడ్‌ యంగ్‌ హీరో నిఖిల్‌ వివాహం వాయిదా పడుతూ వస్తోంది. పల్లవి వర్మ అనే డాక్టర్‌తో గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న నిఖిల్‌ పెద్దల అంగీకారంతో ఇటీవల నిశ్చితార్థం జరిగిన విషయం తెలసిందే. అయితే వీరి వివాహం ఏప్రిల్‌ 16న జరగాల్సి ఉండగా  లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది. దీంతో ఇరు కుటుంబాల పెద్దలు మే 14న నిఖిల్‌-పల్లవి వివాహం చేయాలని నిర్ణయించారు. అయితే లాక్‌డౌన్‌ మే 17 వరకు పొడిగించడంతో మరోసారి వీరి పెళ్లి వాయిదా పడింది. 

మే 17 తర్వాత సైతం లాక్‌డౌన్ కొనసాగింపు ఉంటుందని ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించడం, ఆ తర్వాత(మే14) మూఢం, ముహుర్తాలు లేక‌పోవ‌టం వ‌ల‌న వధూవరులు ఇద్దరి జాత‌కాల రీత్యా రెండో సారి అనుకున్న ముహూర్తానికే (ఈ నెల 14న) పెళ్లి చేయాలని ఇరు కుటుంబాల పెద్దలు ఫిక్సయ్యారంటా. ప్రభుత్వ లాక్‌డౌన్‌ నిబంధనలను పాటిస్తూ అతికొద్ది మంది సన్నిహితుల సమక్షంలో రేపు(గురువారం) నగర శివార్లలోని ఓ ఫామ్‌ హౌజ్‌లో నిఖిల్‌ పెళ్లి జరగనుందని సమాచారం. అంతకుముందు ఎవరి ఇళ్లలో వాళ్లు సంప్రదాయ బద్దమైన కార్యక్రమాలు నిర్వహించుకునేలా ప్లాన్‌ చేసుకున్నారు. పెళ్లి కూతుర్ని, అలాగే పెళ్లి కొడుకును చేసే కార్యక్రమం కూడా ఈ రోజు సాయంత్రం ఉండునున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇరుకుటుంబాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. 

చదవండి:
శ్రీమతితో తొలి సెల్ఫీ.. వైరల్‌
పవన్‌ కల్యాణ్‌.. ‘ఇప్పుడే మొదలైంది’?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement