
హైద్రాబాద్ : వినీత్, దేవయానీ శర్మ జంటగా నటించిన తూనీగ చిత్రానికి సంబంధించి ప్రత్యేకంగా రూపొందించిన డిజిటల్ డైలాగ్‌ను ప్రముఖ ఆర్టిస్టు లక్ష్మణ్ ఏలే విడుదల చేశారు. ఈ సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. వినూత్న రీతిలో సాగుతున్న చిత్ర ప్రచార సంరంభం తననెంతో ఆకట్టుకుందన్నారు. మొదటి నుంచి సినిమాకు సంబంధించిన అన్ని ప్రచార కార్యక్రమాలూ నవ్యతతో, ఆలోచనలు రేకెత్తించేలా రూపొందిస్తున్న తన మిత్రుడు, ప్రచార బృంద సారథి రత్నకిశోర్ శంభుమహంతిని ప్రశంసించారు.
దర్శకుడిగా పరిచయమవుతున్న ప్రేమ్ సుప్రీమ్‌కు ఆల్ ద బెస్ట్ చెప్పారు. డిజిటల్ డైలాగ్‌ను ఆవిష్కరించిన లక్ష్మణ్ ఏలేకు చిత్ర బృందం ధన్యవాదాలు తెలిపింది. తూనీగ చిత్రానికి సంగీతం సిద్ధార్థ్ సదాశివుని అందిస్తుండగా, ఎడిటర్‌గా ఆర్కే, డీఓపీగా హరీశ్ ఎదిగ పనిచేశారు. త్వరలోనే చిత్రం విడుదలకు సంబంధించిన పూర్తి వివరాలు యూనిట్ వెల్లడించనుంది.
Comments
Please login to add a commentAdd a comment