ఒక్క ట్రైనింగ్‌కి రెండు సినిమాలు | Training one of the two films | Sakshi
Sakshi News home page

ఒక్క ట్రైనింగ్‌కి రెండు సినిమాలు

Published Thu, Aug 13 2015 11:59 PM | Last Updated on Sun, Sep 3 2017 7:23 AM

ఒక్క ట్రైనింగ్‌కి రెండు సినిమాలు

ఒక్క ట్రైనింగ్‌కి రెండు సినిమాలు

ఒక దెబ్బకు రెండు పిట్టలు అనే సామెతను ఈ మధ్య కంగనా రనౌత్ పదే పదే వాడుతున్నారట. దానికి కారణం లేకపోలేదు. ప్రస్తుతం ఆమె గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం నేర్చుకుంటున్నారు. ‘రంగూన్’ చిత్రంలోని పాత్ర కోసం తీసుకుంటున్న ఈ ట్రైనింగ్ మరో సినిమాకి కూడా ఉపయోగపడనుంది.
 
 అందుకే, కంగనా ‘ఒక్క ట్రైనింగ్‌కి రెండు సినిమాలు’ అని సరదాగా అంటున్నారు. ఈ విషయాన్ని కంగనా వివరిస్తూ - ‘‘ఈ ఏడాది నా చేతిలో ఉన్నవన్నీ మంచి పాత్రలే. ‘రంగూన్’లో 1940కి చెందిన సినిమా తారగా నటిస్తున్నా. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో ఓ పరిశోధన నిమిత్తం బ్రిటిష్ బృందంలోకి ఎంటరవుతాను. ఈ పాత్ర చాలా బాగుంటుంది.
 
 తదుపరి రాణీ లక్ష్మీభాయ్ జీవితం ఆధారంగా రూపొందనున్న చిత్రంలో టైటిల్ రోల్ చేయబోతున్నా. ‘రంగూన్’ కోసం నేర్చుకున్న యుద్ధ విద్యలన్నీ ఈ చిత్రానికి ఉపయోగపడతాయి. ‘తను వెడ్స్ మను’, ‘క్వీన్’,  ‘తను వెడ్స్ మను రిటర్న్స్’... నటిగా సంతృప్తినిచ్చాయి. మళ్లీ ఈ రెండు చిత్రాలూ నాకు ఆత్మసంతృప్తినిచ్చేవి కావడం ఆనందంగా ఉంది’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement