త్రిషే టాప్! | Trisha 30 lakhs Twitter mark Followers in Twitter | Sakshi
Sakshi News home page

త్రిషే టాప్!

Published Mon, Nov 21 2016 5:10 AM | Last Updated on Mon, Sep 4 2017 8:38 PM

త్రిషే టాప్!

త్రిషే టాప్!

ఏంటీ నయనతార నెంబర్‌వన్‌గా రాణిస్తుంటే త్రిషనే టాప్ అంటున్నారు అని అనుకుంటున్నారా? అదీ కరెక్టే. ఇదీ రైటే. ఇద్దరూ సంచలన హీరోయిన్లే. నటిగా ఇద్దరూ గెలిచారు. ఇక వ్యక్తిగతంగా చాలా ఒడిదుడుకులను ఎదుర్కొన్నవారే. ఇదలా ఉంచితే చెన్నై చిన్నది త్రిషకు ట్విట్టర్ ఫాలోవర్స్ అధికం. ఎంత అధికం అంటే సహ కోలీవుడ్ తారలెవ్వరూ బీట్ చేయలేనంతగా.. త్రిష ట్విట్టర్, ఫేస్‌బుక్ వంటి సోషల్‌మీడియాపై అధిక దృష్టి సారిస్తారు. ట్విట్టర్ ద్వారా అభిమానులతో తన అభిప్రాయాలను పంచుకోవడం, తన చిత్రాల వివరాలను, ఫోటోలను పోస్ట్ చేయడం చేస్తుంటారు.
 
  తరచూ తన అభిమానులతో ముచ్చటిస్తూ వారి ప్రశ్నలకు బదులిస్తుంటారు. కాగా ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయంపై స్పందించిన ప్రముఖ నటీనటులు రజనీకాంత్, కమలహాసన్, విజయ్ వంటి వారి పట్టికలో నటి త్రిష కూడా చేరి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇవన్నీ త్రిష ట్విట్టర్ ఫాలోవర్స్ సంఖ్యను విపరీతంగా పెంచేశాయి. ఏతావాతా త్రిష ట్విట్టర్ అభిమానులు 30 లక్షలకు చేరారు. ఇంత పెద్ద సంఖ్యలో కోలీవుడ్‌కు చెందిన ఏ నటీనటులకు ట్విట్టర్ అభిమానులు లేరన్నది గమనార్హం.
 
  దీనిపై స్పందించిన ఈ చెన్నై చిన్నది తనకు 30 లక్షల ట్విట్టర్ అభిమానులు ఉండడం చాలా సంతోషంగా ఉందన్నారు. వారందరి ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అన్నారు. త్రిష నటజీవితానికి 13 ఏళ్ల వయసు. ఇప్పటికీ ప్రముఖ కథానాయకిగా రాణిస్తున్నారు. స్టార్ హీరోలతో జత కడుతూనే, మరో పక్క హీరోయిన్ ఓరియంటెడ్ పాత్రలు పోషిస్తున్నారు. ప్రేమ, పెళ్లి విషయాల్లో అపజయాలు త్రిష నటజీవితానికి ఎలాంటి అవరోధం కాలేదన్నది గమనార్హం. ఇటీవల నటుడు ధనుష్ సరసన కొడి చిత్రంలో నటించిన విషయం తెలిసిందే.
 
  అందులో ధనుష్‌ను హత్య చేసే విలనిజం ప్రదర్శించి మంచి మార్కులు కొట్టేశారు. ఆమె ట్విట్టర్ ఫాలోవర్స్ పెరగడానికి ఇదీ ఒక కారణం కావచ్చు అంటున్నారు సినీ పండితులు. త్రిష ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ హారర్, థ్రిల్లర్ మోహిని చిత్రంతో పాటు అరవిందస్వామికి జంటగా చతురంగవేటై్ట-2 చిత్రంలోనూ నటిస్తున్నారు. త్వరలో విజయ్‌సేతుపతి సరసన నటించనున్నారు. వీటితో పాటు హిందీలో సంచలన విజయం సాధించిన ఎన్‌హెచ్-10 రీమేక్‌లోనూ నటించే విషయమై చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement