'నరకంలో అయినా శిక్ష పడాలని ప్రార్థిస్తున్నా' | Trisha commented on uttarakhand Mla issue | Sakshi
Sakshi News home page

'నరకంలో అయినా శిక్ష పడాలని ప్రార్థిస్తున్నా'

Published Tue, Mar 15 2016 2:38 PM | Last Updated on Sun, Sep 3 2017 7:49 PM

'నరకంలో అయినా శిక్ష పడాలని ప్రార్థిస్తున్నా'

'నరకంలో అయినా శిక్ష పడాలని ప్రార్థిస్తున్నా'

సౌత్ స్టార్ హీరోయిన్ త్రిషకు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ద్వారా అభిమానులకు అందుబాటులో ఉంటుంది. సౌత్ లో వరుస సినిమాలతో యమ బిజీగా ఉన్న ఈ బ్యూటీ ప్రస్తుతం సామాజిక అంశాల మీద కూడా తన అభిప్రాయాలను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా అదే బాటలో త్రిష్ చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ గా మారింది.

ఉత్తరఖండ్ రాష్ట్రంలోని ఓ బీజేపీ ఎమ్మెల్యే.. పోలీస్ గుర్రం పై విచక్షణారహితంగా దాడి చేసిన ఘటన పై స్పందించిన త్రిష తన ట్విట్టర్ పేజ్ లో  తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఈ చర్యకు పాల్పడ్డ వ్యక్తిని ఉద్దేశిస్తూ 'నీకు నరకంలో అయినా శిక్ష పడాలని ప్రార్థిస్తున్నాను, ఇది సిగ్గు చేటు' అంటూ ట్వీట్ చేసింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement