పాపం త్రిష
ఒక్కోసారి ఊహించని పరిణామాలతో మనసు అతలాకుతలం అవుతుంది. మంచికి పోతే చెడు ఎదురవుతుందని పెద్దలు చెబుతుంటారు. నటి త్రిష అలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నారు. శ్రీలంక తమిళులను ఊచకోత కోసిన ఆ ప్రభుత్వమన్నా, ఆ దేశ అధ్యక్షుడు రాజపక్సే అన్నా తమిళ సంఘాలు మండిపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితిలో ఇటీవల అందాల తార త్రిష కెనడాలో రాజపక్సే మద్దతుదారులు నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో త్రిష బెంబేలెత్తిపోయారు. నిజానికి త్రిష అక్కడ వికలాంగుల కోసం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారట. ఈ విషయాన్ని తన సన్నిహితులతో చెప్పుకుని ఆవేదన చెందారు. సరిగ్గా అలాంటి పరిస్థితిలో దేవుడు కరుణించాడో లేక ఆమె టైమ్ బాగుందో గాని కెనడాలోని కొన్ని తమిళ సంఘాలు త్రిష పాల్గొన్న కార్యక్రమం రాజపక్సే మద్దతుదారులు నిర్వహించింది కాదని వెల్లడించారుు. దీంతో రక్షించావుదేవుడా అంటూ త్రిష రిలాక్స్ అయ్యారట.