వివాదంలో ‘96’ | Vijay Sethupathi Trisha 96 Lands In Controversy | Sakshi
Sakshi News home page

Published Sat, Oct 6 2018 12:16 PM | Last Updated on Sat, Oct 6 2018 4:42 PM

Vijay Sethupathi Trisha 96 Lands In Controversy - Sakshi

సౌత్ సీనియర్‌ హీరోయిన్ త్రిష ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా 96. కోలీవుడ్ సంచలన నటుడు విజయ్‌ సేతుపతి హీరోగా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. సీ ప్రేమ్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వివాదంలో చిక్కుంది. ఈ సినిమా కథ తనదంటూ ఆర్‌ విచు అనే వ్యక్తి ఆరోపిస్తున్నాడు.

తాను 96 చిత్ర నిర్మాత నంద గోపాల్‌కు నాలుగైదు సంవత్సరాల క్రితం ఈ కథ వినిపించానని.. ఇప్పుడు అదే కథను మరో దర్శకుడితో తెరకెక్కించారని తెలిపారు. అయితే ఈ ఆరోపణలపై చిత్రయూనిట్ స్పందించలేదు. తమిళ నాట ఘనవిజయం సాధించిన ఈ సినిమాను తెలుగులో దిల్‌రాజు బ్యానర్‌లో రీమేక్‌ చేస్తున్నారు. ఈసినిమా నాని, సమంతలు జంటగా నటించనున్నారన్న ప్రచారం జరుగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement