పెరంబూరు(తమిళనాడు): అయ్యప్పస్వామి దేవాలయంలో మహిళల ప్రవేశం గురించి సుప్రీంకోర్టు ఇటీవల సంచలన తీర్పును వెల్లడించిన విషయం తెలిసిందే. శబరిగిరీశుని దర్శనానికి మహిళలు అర్హులేనన్న ఆ తీర్పుపై ప్రజల్లో మిశ్రమ స్పందన వస్తున్న నేపథ్యంలో వివాదాస్పద అంశాల్లో ఎప్పుడూ ముందుండే నటి త్రిష తన నైజాన్ని మరోసారి ప్రదర్శించింది.
ఈ మధ్య సహజీవనం సబబే అన్న కోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు చెప్పిన ఈ చెన్నై చిన్నది తాజాగా అయ్యప్పస్వామి ఆలయ ప్రవేశానికి మహిళలకు ఎలాంటి నిషేధం ఉండదని ప్రకటించిన సుప్రీంకోర్టు ఆదేశాలు స్త్రీలకు దక్కిన గౌరవం అని పేర్కొంది. ఇటీవల తను నటించిన 96 చిత్ర విలేకరుల సమావేశంలో పాల్గొన్న త్రిష మాట్లాడుతూ అయ్యప్పస్వామి ఆలయప్రవేశానికి మహిళలకు అనుమతినిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు స్ట్రీలకు దక్కిన గౌరవంగా పేర్కొంది. అయితే ఈ వ్యవహారం గురించి తనకు పూర్తిగా తెలియదు గానీ ఎవరినీ అడ్డుకోరాదని అంది. నటుడు విజయ్‌సేతుపతి కూడా ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించారు.
Comments
Please login to add a commentAdd a comment