లేడీ ఓరియెంటెడ్ త్రివిక్రమ్ ఫిల్మ్? | Trivikram Lady oriented film ? | Sakshi
Sakshi News home page

లేడీ ఓరియెంటెడ్ త్రివిక్రమ్ ఫిల్మ్?

Published Tue, Jun 16 2015 11:33 PM | Last Updated on Sun, Sep 3 2017 3:50 AM

లేడీ ఓరియెంటెడ్ త్రివిక్రమ్ ఫిల్మ్?

లేడీ ఓరియెంటెడ్ త్రివిక్రమ్ ఫిల్మ్?

 సమంత... హాట్ హీరోయిన్ ఆఫ్ తెలుగు, తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీస్. అభినయంతో మెప్పించాలన్నా, అందంతో ఆకట్టుకోవాలన్నా ఇప్పుడు ఈ చెన్నై బ్యూటీ పేరు చెప్పుకోవాల్సిందే. మొన్న సమ్మర్‌లో రిలీజైన త్రివిక్రమ్ - అల్లు అర్జున్‌ల ‘సన్నాఫ్ సత్యమూర్తి’ తరువాత సమంత మళ్ళీ తెలుగు సెట్స్‌లో కనిపించడం లేదు. చెన్నైలో షూటింగ్‌లతో బిజీగా ఉన్నారు. విక్రమ్ సరసన ‘పత్తు ఎణ్రదు కుళ్ళ’, ‘మనం’ ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో సూర్య సరసన ‘24’ సహా మరో పేరు పెట్టని తమిళ సినిమాలతో ఆమెకు సరిపోతోంది. ఎంత బిజీగా అంటే... ఈ మధ్య హైదరాబాద్‌కు రావడమే తగ్గింది.

కంటి నిండా నిద్ర పోవడానికి కూడా తీరిక లేదని సన్నిహితుల వద్ద ఆమె వాపోతున్నారట. అయితే, ఈ పరిస్థితుల్లోనూ మరిన్ని మంచి పాత్రలు చేయాలన్న కోరిక మాత్రం ఆమెలో తగ్గలేదు. నటనకే పరిమితం కాకుండా, సామాజిక స్పృహతో సహాయ సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొనే సమంత అందుకు తగ్గట్లే ఒక మహిళా ప్రధాన చిత్రంలో పాల్గొనాలని యోచిస్తున్నారట! అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ అందు కోసం స్క్రిప్టు సిద్ధం చేస్తున్నట్లు కృష్ణానగర్ కబురు.  ప్రస్తుతం చిన్న ఎన్టీఆర్‌తో సినిమాకు ఆయన సిద్ధమవుతున్నట్లు భోగట్టా. కానీ, ఆ సినిమా పట్టాలెక్కడానికి కాస్తంత టైమ్ ఉంది కాబట్టి, ఈ సమంత సినిమా చేస్తారని వార్త.

అయితే, ఆయన కేవలం స్క్రిప్ట్ అందిస్తారా, దర్శకత్వం కూడా చేస్తారా అన్నది తెలీదు. ఇటీవలే డేట్ల కోసం తన వద్దకు వచ్చిన దర్శక, నిర్మాతలకు సమంతే స్వయంగా ఈ లేడీ ఓరియెంటెడ్ సినిమా గురించి చెప్పారట! రచయిత, దర్శకుడెవరన్నది మాత్రం సస్పెన్స్‌లో పెట్టారు. ప్రస్తుతానికి చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నా, కాస్తంత ఖాళీ దొరికే సమంత ఈ కొత్త ప్రాజెక్ట్‌తో తన ముచ్చట తీర్చుకుంటారేమో చూడాలి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement