సినిమా కుదిరిందా? | Samantha and Naga Chaitanya to team up for Trivikram's next romantic comedy? | Sakshi
Sakshi News home page

సినిమా కుదిరిందా?

Published Thu, Mar 16 2017 11:04 PM | Last Updated on Tue, Sep 5 2017 6:16 AM

సినిమా కుదిరిందా?

సినిమా కుదిరిందా?

‘‘అంతా కలిసొస్తే మేం వచ్చే ఏడాది వెండితెరపై మళ్లీ జంటగా కనిపించే అవకాశం ఉంది’’ అని సమంత ఇటీవల ఓ సందర్భంలో చెప్పారు. నాగచైతన్యతో మళ్లీ ఎప్పుడు కలసి నటిస్తారు? అని అడిగితే, సమంత ఈ విధంగా స్పందించారు. ఇప్పుడు  మంచి కథ–క్యారెక్టరైజేషన్స్‌ కుదిరినట్లున్నాయి. నాలుగోసారి వెండితెరపై కనువిందు చేసేందుకు సమంత, నాగచైతన్య జంట రెడీ అవుతోంది.

ఈ ఇద్దరూ ‘ఏ మాయ చేశావే’, ‘ఆటోనగర్‌ సూర్య’, ‘మనం’ చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. తాజాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారట. ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్‌ పతాకంపై  నాగార్జున నిర్మించనున్నారని టాక్‌. దేవిశ్రీ ప్రసాద్‌ బాణీలు సమకూర్చుతారట. విజయదశమికి కొబ్బరికాయ కొట్టి, షూటింగ్‌ షెడ్యూల్‌ను సెప్టెంబర్‌లో మొదలుపెట్టనున్నారని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement