త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ | Trivikram srinivas to do next movie with Allu Arjun | Sakshi
Sakshi News home page

త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ

Published Tue, Nov 5 2013 11:22 PM | Last Updated on Sat, Sep 2 2017 12:18 AM

త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ

త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ

‘జులాయి’ సినిమాలో త్రివిక్రమ్ పెన్ను ఎప్పటిలాగే వేగంగానే కదిలింది. బన్నీ కూడా ఆ డైలాగుల్ని చాలా ఫన్నీగా చెప్పేసి ప్రేక్షకులతో విజిల్స్ వేయించారు. ‘పొద్దున్నే కోడి కూడా లేస్తుంది.. ఏం లాభం.. చికెనొండుకొని తినేయట్లా...’ ఈ డైలాగు సాధారణమైందే... కానీ దాన్ని బన్నీ పలికిన తీరే విభిన్నం. హీరో మంచి టైమింగ్ కలవాడైతే... డైలాగు రైటర్లు ఆటోమేటిగ్గా చెలరేగిపోతారు. ఇక త్రివిక్రమ్ గురించి ప్రత్యేకించి చెప్పాలా? పైగా దర్శకుడు కూడా తనే కదా.
 
 పస్తుతం ఈ మాటల మాంత్రికుడి హవా నడుస్తోంది. ‘అత్తారింటికి దారేది’తో వందకోట్ల దర్శకుడుగా కూడా చరిత్ర సృష్టించబోతున్నారాయన. ఈ విజయ పరంపర ‘జులాయి’ నుంచే మొదలైందని చెప్పాలి. అందుకే రెండోసారి కూడా బన్నీతో సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారాయన. అక్కినేని నట వారసుడు అఖిల్ తెరంగేట్రం చేసే సినిమాకు త్రివిక్రమే దర్శకుడంటూ వెబ్‌సైట్లు ఊదరగొడుతున్నాయి.
 
 కానీ అసలు విషయం ఏమిటంటే - త్రివిక్రమ్ ప్రస్తుతం అల్లు అర్జున్ సినిమా స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు. ‘జులాయి’ చిత్ర నిర్మాత ఎస్.రాధాకృష్ణే ఈ చిత్రాన్ని కూడా నిర్మించనుండటం విశేషం. ‘రేసుగుర్రం’ తర్వాత బన్నీ చేయబోయే సినిమా ఇదే అంటున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్‌కి వెళ్లనుందని సమాచారమ్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement