త్రిశూలంతో వస్తారా..? | Allu Arjun-Trivikram Movie Title 'Trisulam'? | Sakshi
Sakshi News home page

త్రిశూలంతో వస్తారా..?

Published Sun, Nov 2 2014 11:07 PM | Last Updated on Sat, Sep 2 2017 3:46 PM

త్రిశూలంతో వస్తారా..?

త్రిశూలంతో వస్తారా..?

అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన ‘జులాయి’ చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఆ సినిమా తర్వాత విడివిడిగా ‘అత్తారింటికి దారేది’తో త్రివిక్రమ్, ‘రేసుగుర్రం’తో బన్నీ గ్రాండ్ సక్సెస్‌లు అందుకొని తమ సత్తా చాటారు. ఇప్పుడు మళ్లీ వీరి కాంబినేషన్‌లో సినిమా అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకించి చెప్పాలా? ‘జులాయి’ చిత్రనిర్మాతల్లో ఒకరైన ఎస్. రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి ‘త్రిశూలం’ అనే టైటిల్ అనుకుంటున్నట్లు సమాచారం. ఇందులో సమంత, నిత్యామీనన్, అదా శర్మ కథానాయికలుగా నటిస్తున్నారు. ఓ ప్రత్యేక పాత్రను ఉపేంద్ర చేస్తున్నారు. అలాగే, స్నేహ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ పాటలు స్వరపరుస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement