
ప్రముఖ బాలీవుడ్ చిత్ర నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ ఇంట్లో ఇద్దరికి కరోనా సోకింది. సోమవారం జరిపిన కోవిడ్ పరీక్షలో తన ఇంటి స్థాఫ్ ఇద్దరికి కరోనా నిర్ధారణ అయ్యిందని స్వయంగా కరణ్ తన ట్వీట్టర్ ద్వారా వెల్లడించారు. మిగతా ఇంటి సభ్యులకు, సిబ్బంది ఎవరికీ కరోనా సోకలేదని అందరూ క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. కరోనా సోకిన ఇద్దరిని వెంటనే తన ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉంచామని, వారికి అన్ని విధాల అండగా నిలుస్తాం. అధికారులు సూచించిన అన్ని నిబంధనలకు కట్టుబడి ఉన్నాం అని పేర్కొన్నారు. వారికి మంచి ట్రీట్‌మెంట్ అందిస్తున్నాం త్వరలోనే వారు కోలుకుంటారు అని కరణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. (ఒంటరినైపోయినట్లు అనిపించింది )
"ఇంటి సిబ్బందిలో ఇద్దరికి కరోనా పాజిటివ్ అని నిర్థారణ కాగానే వెంటనే ముంబై మున్సిపాల్ కార్పోరేషన్‌కి సమాచారం ఇచ్చాం. సిబ్బంది వచ్చి మా ఇంటిని, చుట్టు పక్కన ప్రాంతాన్ని కెమికల్ స్ప్రే చేశారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మా ఇంట్లో వాళ్లందరం రానున్న 14 రోజుల పాటు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉంటాం. కరోనా సంక్షోభంలో ప్రతీ ఒక్కరం ప్రభుత్వం సూచించిన నిబంధనలను పాటిస్తే కరోనాను ధీటుగా ఎదుర్కోవచ్చు. కాబట్టి అందరూ ఇంట్లోనే ఉండండి, క్షేమంగా ఉండండి" అంటూ కరణ్ ట్వీట్ చేశారు.
— Karan Johar (@karanjohar) May 25, 2020
ఇక సోమవారం కరణ్ పుట్టినరోజు. 47 ఏళ్లు పూర్తిచేసుకొని 48వ వసంతంలోకి అడుగుపెట్టిన బాలీవుడ్ దిగ్గజ దర్శకుడికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఇంట్లోనే కేక్ కట్ చేసిన కరణ్..తన ఇద్దరు పిల్లలు యశ్ , రూహి సరదాగా తనను బుడ్డా (ముసలోడా )అంటూ పిలిచిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. (యశ్ నోట ‘ఐ లవ్ ఇండియా’ ) లాక్‌డౌన్ మొదలైనప్పటినుంచి జట్టుకు రంగు వేయక తెల్లబడిందని, దీంతో పిల్లలు తనను ముసలోడా అంటూ ఆటపట్టిస్తున్నారని పేర్కొన్నాడు. అంతకంతకూ పెరుగుతున్న కరోనా కేసులతో భారత్ ప్రపంచంలోనే టాప్ 10 లో చోటు దక్కించుకుంది. దేశంలో ఇప్పటివరకు 1,38,345 కరోనా కేసులు నమోదవగా, 4021 మంది ప్రాణాలు కోల్పోయారు.
Comments
Please login to add a commentAdd a comment