
ఈ వారం తమ కుటుంబానికి ఎంతో ప్రత్యేకం అని చెబుతోంది మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ సతీమణి ఉపాసన. సోషల్ మీడియాలో ఎపుడు ఎంతో యాక్టివ్‌గా ఉండే ఉపాసన తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలను మెగాభిమానులకు చేరవేస్తూ ఉంటుంది. తాజగా ఉపాసన తన ట్విటర్ అకౌంట్‌లో తన ఫ్యామిలీ మెంబర్స్‌లో జరుపుకున్న వేడుకకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసింది.
(చదవండి : లవ్ యూ అమ్మ: రామ్ చరణ్)
‘ఈ వారంలో మా ఇంట్లో స్పెషల్ వేడుకలు జరిగాయి. అత్తమ్మ సురేఖ, మామయ్య చిరంజీవిల పెళ్లి వివాహా వార్షికోత్సవంతో పాటు.. అమ్మ, నాన్నల 35వ పెళ్లిరోజు, అనింధత్ 30వ బర్త్ డే. విష్ణు చిన్నాయన 60వ పుట్టినరోజు వేడుకలని జరుపుకోవడం ఆనందంగా ఉంది’ అంటూ ఉపాసన ట్విట్ చేసింది.
కాగా, మెగాస్టార్ చిరంజీవి, సురేఖల వివాహం 1980 ఫిబ్రవరి 20న జరిగింది. వారికి వివాహమై.. 40 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ నెల 20న పెళ్లిరోజు వేడుకను మెగా ఫ్యామిలీ ఘనంగా నిర్వహించింది.
Comments
Please login to add a commentAdd a comment