అందాల రాక్షసితో వైభవ్ | Vaibhav acts with lavanya tripathi | Sakshi
Sakshi News home page

అందాల రాక్షసితో వైభవ్

Published Sat, Aug 16 2014 12:30 AM | Last Updated on Sun, Jul 14 2019 4:05 PM

అందాల రాక్షసితో వైభవ్ - Sakshi

అందాల రాక్షసితో వైభవ్

వైభవ్ హీరోగా ఓ చిత్రం మొదలైంది. ‘అందాల రాక్షసి’ ఫేమ్ లావణ్య త్రిపాఠి ఇందులో కథానాయిక. దర్శకుడు రాజమౌళి దగ్గర ‘మగధీర’, ‘మర్యాద రామన్న’, ‘ఈగ’ చిత్రాలకు అసోసియేట్‌గా పనిచేసిన జగదీశ్ తలశిల దర్శకునిగా పరిచయమవుతున్నారు. మయూఖ క్రియే షన్స్ పతాకంపై సాయిప్రసాద్ కామినేని నిర్మిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు శుక్రవారం హైదరాబాద్‌లో జరిగాయి. ముహూర్తపు దృశ్యానికి కీరవాణి కెమెరా స్విచాన్ చేయగా, రాజమౌళి క్లాప్ ఇచ్చారు. సీనియర్ దర్శకులు ఎ. కోదండరామిరెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ నెల 20 నుంచి చిత్రీకరణ మొదలుపెడతామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: జలదంకి సుధాకర్, కెమెరా: ఈశ్వర్ యొల్లు మహంతి, సంగీతం: కీరవాణి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement