
ఎఫ్ 2 సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మెగా హీరో వరుణ్ తేజ్ ప్రస్తుతం ఓ రీమేక్ సినిమా కోసం రెడీ అవుతున్నాడు. కోలీవుడ్ లో ఘన విజయం సాధించిన జిగర్తాండ సినిమాను తెలుగులో వాల్మీకి పేరుతో రీమేక్ చేస్తున్నాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈసినిమాలో వరుణ్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడు.
ఈ సినిమా కోసం వరుణ్ డిఫరెంట్ మేకోవర్‌లో రెడీ అవుతున్నాడు. ఇప్పటికే వరుణ్ సినిమాలో లుక్‌కు సంబంధించి ఓ పోస్ట్ చేసినా అందులో లుక్ రివీల్ కాకుండా జాగ్రత్త పడ్డాడు. కానీ తాజాగా వరుణ్ లుక్‌కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. సెట్‌లో ఓ అభిమానితో కలిసి వరుణ్ దిగిన ఫోటో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. బాగా పెరిగిన జుట్టు, గెడ్డంతో వరుణ్ డిఫరెంట్‌గా కనిపిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment