గురువు హితబోధ..సినిమాలకు గుడ్‌బై | Veena Malik retires from commercial cinema, will do only social films | Sakshi
Sakshi News home page

గురువు హితబోధ..సినిమాలకు గుడ్‌బై

Published Mon, Jan 27 2014 10:36 PM | Last Updated on Sat, Sep 2 2017 3:04 AM

గురువు హితబోధ..సినిమాలకు గుడ్‌బై

గురువు హితబోధ..సినిమాలకు గుడ్‌బై

హాట్‌హాట్ పోజులు, వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే పాక్ నటి వీణా మాలిక్ అభిమానులకు ఇది చేదు కబురు. ఇక నుంచి మత, సామాజికపరమైన కార్యక్రమాలు మినహా సినిమాల్లో నటించబోనని ఈమె ప్రకటించింది. ఒక ఇస్లామిక్ గురువు బోధనలు తనలో పరివర్తన తెచ్చాయని చెప్పింది. ‘ఇక నుంచి భారత్, పాక్ సినిమాలేవీ చేయను. గతంలో ఒప్పుకున్న ప్రాజెక్టుల నుంచి కూడా వైదొలుగుతాను’ అని ఈ 29 ఏళ్ల బ్యూటీ తెలిపింది. అసద్ బషీర్ ఖాన్ ఖట్టక్ అనే దుబాయి వ్యాపారిని వీణ గత సంవత్సరం పెళ్లి చేసుకోవడం తెలిసిందే. ‘ఇస్లాం పండితుడు మౌలానా సాహిబ్ నా జీవితాన్ని సమూలంగా మార్చేశారు. 
 
 ఇక నుంచి బుర్ఖా వేసుకుంటానని ఆయనకు మాటిచ్చాను.  నా నిర్ణయాన్ని అభిమానులు, స్నేహితులు ప్రశంసించారు. అందరిలాగే నేనూ తప్పులు చేశాను. అందుకు భగవంతుణ్ని క్షమాపణలు కోరుతున్నాను’ అని వివరించారు. ఇక నుంచి సంప్రదాయ జీవితానికే కట్టుబడి ఉండే శక్తిని దేవుడు తనకు ఇవ్వాలని అభిమానులు ప్రార్థించాలని కూడా కోరింది.  పాకిస్థాన్ ప్రజల సంక్షేమం కోసం చేతనైనంత కృషి చేస్తానని తెలియజేసింది. ఇవన్నీ ఇలా ఉంటే పాకిస్థాన్ టీవీ షోలో అసద్‌తో కలిసి ఒక కార్యక్రమం నిర్వహించడానికి వీణ సిద్ధమవుతోందట. ఇందుకోసం ఇది వరకే చానెళ్లను సంప్రదించిందని సమాచారం. అన్నట్టు అసద్ కూడా పాకిస్థాన్ జాతీయుడే. ఒక భారతీయ సినిమా పత్రికకు టాప్‌లెస్‌గా పోజివ్వడం, బిగ్‌బాస్‌లో అస్మిత్ పటేల్‌తో సన్నిహితంగా మెలగడం వంటివి వీణామాలిక్‌కు విపరీత ప్రచారం తెచ్చిపెట్టాయి.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement