పాక్ నుంచి భారత్‌కు ఓ మెసేజ్: నటి | India here is message from pakisthan says veena malik | Sakshi
Sakshi News home page

పాక్ నుంచి భారత్‌కు ఓ మెసేజ్: నటి

Published Fri, Apr 1 2016 4:50 PM | Last Updated on Wed, Jul 25 2018 1:49 PM

పాక్ నుంచి భారత్‌కు ఓ మెసేజ్: నటి - Sakshi

పాక్ నుంచి భారత్‌కు ఓ మెసేజ్: నటి

లాహోర్: కిక్రెట్ చూసే భారతీయులందరికి తెలిసిన అడ్వర్టజ్మెంట్స్ ఒకటి ఉంది. అదే మౌకా మౌకా.. అంటూ ప్రతి వరల్డ్ కప్ సమయంలో వచ్చే యాడ్. పాక్ అభిమాని టపాసులు చేతిలో పట్టుకొని వరల్డ్‌ కప్‌లో భారత్ పై విజయం సాధిస్తే పేలుద్దామని చూస్తుంటాడు. అయితే ఆ తర్వాత భారత్ గెలవడం ఆ టపాసులను యధావిధిగా తీసుకెళ్లి దాచిపెడుతుంటాడు.. ఈ యాడ్ భారత్‌కు పాకిస్తాన్‌పై వరల్డ్ కప్‌లో ఉన్న తిరుగులేని రికార్డును సూచిస్తుంది.

అయితే ఇప్పుడు దాని ప్రస్తావన ఎందుకంటారా?..గురువారం భారత్ పై వెస్టిండీస్ విజయం సాధించి పైనల్‌లోకి దూసుకు పోయింది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ గెలుపు కన్నా భారత్ పైనల్‌కు చేరలేదన్న ఆనందం పాక్ వాసుల్లో ఎక్కువగా కనిపించింది. మరీ ముఖ్యంగా బాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించి, పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న పాకిస్తానీ నటి వీణా మాలిక్ ఇప్పుడు భారత్‌కు ఓ మేసేజ్ ఇచ్చింది. ఎంత అద్భుతమైన మ్యాచ్..వెస్టిండీస్‌ మీరు సాధించారు. డియర్ ఇండియా, పాకిస్తాన్ నుంచి మీకో మెసేజ్ ...'మౌకా మౌకా' అంటూ ట్విట్ చేసింది. అయితే వరల్డ్‌ కప్‌లో భారత్‌పై ఎలాగూ గెలిచే సత్తా పాకిస్తాన్‌కు లేకపోవడంతోనే..కనీసం ఇలాగైనా వీణామాలిక్ తృప్తిపడిందంటూ... నెటిజన్లు సదరు నటిపై సెటైర్లు వేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement