మహిళల సిరీస్‌పై సందిగ్ధత | Pakistan-India women series in doubt | Sakshi
Sakshi News home page

మహిళల సిరీస్‌పై సందిగ్ధత

Published Tue, Oct 18 2016 12:46 AM | Last Updated on Mon, Sep 4 2017 5:30 PM

Pakistan-India women series in doubt

న్యూఢిల్లీ: చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ మహిళా క్రికెట్ జట్ల మధ్య ఈ నెలలో జరగాల్సిన మూడు వన్డేల సిరీస్ సందిగ్ధంలో పడింది. యూఏఈలో ఈ నెలలో జరగాల్సిన ఈ టోర్నీలో ఆడేందుకు ప్రభుత్వ అనుమతి కోసం బీసీసీఐ ఎదురు చూస్తోంది. ఒకవేళ భారత్ ఈ సిరీస్‌లో ఆడకపోతే ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధించే అవకాశాన్ని కోల్పోతుంది.

 భారత్ ఆడకపోతే పాక్‌కు ఆరు పాయింట్లు ఇస్తారు. తద్వారా ఆ జట్టు వెస్టిండీస్, ఇంగ్లండ్, న్యూజిలాండ్‌లతో పాటు 2017 ప్రపంచకప్‌కు నేరుగా అర్హత సాధిస్తుంది. భారత్ మాత్రం మరో 9 దేశాలతో కలిసి క్వాలిఫయింగ్ టోర్నీ ఆడాల్సి వస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement