విడాకులు తీసుకున్న వీణామాలిక్ | Veena Malik takes Divorce from Asad Khattak | Sakshi
Sakshi News home page

విడాకులు తీసుకున్న వీణామాలిక్

Published Sat, Mar 11 2017 11:02 AM | Last Updated on Thu, Jul 18 2019 1:41 PM

విడాకులు తీసుకున్న వీణామాలిక్ - Sakshi

విడాకులు తీసుకున్న వీణామాలిక్

బిగ్ బాస్ టీవీ షోతో భారతీయ ప్రేక్షకులకు చేరువైన పాకిస్థానీ నటి వీణామాలిక్. బాలీవుడ్ సినిమాల్లోనూ అలరించిన ఈ బ్యూటీ పెళ్లి తరువాత సినిమాలకు దూరమైంది. అసద్ ఖటక్ అనే వ్యాపార వేత్తను 2013లో పెళ్లాడిన వీణ పూర్తిగా కుంటుబానికి అంకితమైంది. అయితే కొంత కాలంగా తిరిగి సినీ రంగంలోకి రావాలని ప్రయత్నిస్తున్న వీణాకు కుటుంబ సభ్యులు అడ్డు చెపుతున్నారు. తన అభిప్రాయానికి భర్త అసద్, అతని కుటుంబ సభ్యుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో విడాకులు తీసుకునేందుకు నిర్ణయించుకుంది ఈ పాకిస్థానీ బ్యూటి.

కొంతకాలంగా భర్తనుంచి విడిగా ఉంటున్న వీణామాలిక్, విడాకుల కోసం లాహోర్ కోర్టును ఆశ్రయించింది. అయితే కోర్టు పంపిన సమన్లకు వీణా భర్త అసద్ నుంచి ఎలాంటి రిప్లై రాకపోవటంతో, కోర్టు వీణాకు అనుకూలంగా తీర్పు నిచ్చింది. ఈ విషయంపై మీడియా వీణా మాలిక్ను సంప్రదించే ప్రయత్నం చేసినా ఆమె స్పందించేందుకు నిరాకరించింది. ప్రస్తుతం భర్త నుంచి చట్టపరంగా వేరుపడిన ఈ హాట్ బ్యూటీ త్వరలోనే సిల్వర్ స్క్రీన్ రీ ఎంట్రీకి ప్లాన్ చేసుకుంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement