Kannada Bigg Boss Fame Kirik Keerthi Divorce With Wife Arpitha - Sakshi
Sakshi News home page

Kirik Keerthi: భార్యతో విడాకులు... అఫీషియల్‌గా ప్రకటించిన బిగ్ బాస్ కంటెస్టెంట్!

Published Sat, Aug 19 2023 4:46 PM | Last Updated on Sat, Sep 2 2023 4:44 PM

Kannda Bigg Boss Fame Kirik Keerthi Divorce With Wife Arpitha - Sakshi

బిగ్ బాస్ కంటెస్టెంట్ కిరిక్ కార్తీ తన వివాహాబంధానికి ముగింపు పలికారు. తన భార్య అర్పితకో విడాకులు తీసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.  పాత జ్ఞాపకాలన్నీ మరిచిపోయి త్వరలోనే కొత్త జీవితం ప్రారంభించనున్నట్లు కిరిక్ కీర్తి వెల్లడించారు.  ఈ జంట పెళ్లైన దాదాపు 11 ఏళ్లకు తమ వివాహాబంధానికి గుడ్ బై చెప్పారు.  కాగా.. వీరిద్దరికీ ఇప్పటికే ఓ కుమారుడు కూడా ఉన్నారు.  గతంలో వీరిద్దరు డైవర్స్ తీసుకోబోతున్నట్లు పలుసార్లు రూమర్స్ వచ్చాయి. తాజాగా ఆ వార్తలు నిజమయ్యేలా.. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట ఇప్పుడు విడాకులు తీసుకున్నారు. 

(ఇది చదవండి : వెక్కి వెక్కి ఏడ్చిన అనసూయ.. ఇంత డిప్రెషన్‌లో ఉందా? )

ఇన్‌స్టాలో కిరిక్ కీర్తి రాస్తూ.. ' ఈ రోజు చట్టం ప్రకారం మేం విడిపోయాం.  అర్పిత, నాకు మధ్య బంధానికి పూర్తిగా తెరపడింది. ఇక నుంచి నా వ్యక్తిగత విషయాలతో ఆమెకు ఎలాంటి సంబంధం లేదు.  ఉండదు కూడా. అధికారికంగా మేం విడాకులు తీసుకున్నాం. ఆమె కూడా మంచి జీవితాన్ని పొందాలని ఆశిస్తున్నా. చేదు జ్ఞాపకాలను మరచిపోయి.. మీ ప్రేమ, శుభాకాంక్షలు భవిష్యత్తులోనూ నాపై కొనసాగాలని కోరుకుంటున్నా.' అంటూ పోస్ట్ చేశారు.   ఫిబ్రవరి 2023లో డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు కిరిక్ కీర్తి  వెల్లడించారు. తన కొడుకు భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నానని.. జీవితం ప్రశ్నార్థకంగా మారిందని చెప్పుకొచ్చాడు. 

కాగా.. కిరిక్ కీర్తి,  అర్పిత మొదటిసారి కాలేజీలో కలుసుకున్నారు. ఆ తర్వాత వారి స్నేహం పెళ్లిబంధంగా మారింది. అయితే వీరు పెళ్లికి ముందు చాలా కష్టాలను ఎదుర్కొన్నారు. వీరి వివాహానికి అర్పిత తల్లిదండ్రులు అంగీకరించలేదు. 

(ఇది చదవండి: రాజమౌళిపై రేణు దేశాయ్ ప్రశంసలు.. ఎందుకో తెలుసా? )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement