మహేష్ కోసం విజయ్‌, వెంకీ | Venkatesh And Vijay Devarakonda Chief Guests for Maharshi Event | Sakshi
Sakshi News home page

మహేష్ కోసం విజయ్‌, వెంకీ

Published Wed, May 1 2019 12:33 PM | Last Updated on Wed, May 1 2019 12:33 PM

Venkatesh And Vijay Devarakonda Chief Guests for Maharshi Event - Sakshi

సూపర్‌ స్టార్ మహేష్‌ బాబు హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం మహర్షి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు, అశ్వనిదత్‌, పీవీపీలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్‌. ఇప్పటికే అన్ని కార్యాక్రమాలు పూర్తి చేసుకున్న మహర్షి మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ మహేష్ 25వ సినిమా కూడా కావటంతో అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఆ అంచనాలు మరింత పెంచేలా భారీ ప్రీ రిలీజ్‌ కు ఈవెంట్‌ను నిర్వహిస్తున్నారు చిత్రయూనిట్‌. బుధవారం సాయంత్రం  నెక్లెస్‌రోడ్‌లోని పీపుల్స్‌ ప్లాజాలో అభిమానుల సమక్షంలో గ్రాండ్‌ ఈవెంట్‌ను నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్‌కు సీనియర్‌ హీరో వెంకటేష్‌తో పాటు యంగ్‌ సెన్సేషన్‌ విజయ్‌ దేవరకొండ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. అంతేకాదు మహేష్‌తో గతంలో వర్క్‌ చేసిన దర్శకులలో చాలా మంది ఈ వేడుకకు హాజరవుతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement