
అయ్యో... అయ్యో అయ్యయ్యో...
ఏసీపీ కృష్ణ సిన్సియర్ పోలీసాఫీసర్. క్రిమినల్స్‌ను తుక్కు రేగ్గొట్టడంలో ఫస్ట్. అలానే ఎదుటి వాళ్లు కష్టాల్లో ఉంటే కరిగిపోవడంలో కూడా ఫస్టే. మంచితనానికి మారు పేరులాంటివాడు. కృష్ణకు ఓ మంచి అమ్మాయి కనె క్ట్ అయింది. మనసుకు మనసు, జాలికి జాలి... అలానే ఏజ్‌కు ఏజ్ కూడానూ. ‘బాబు బంగారం’లో ఏసీపీ కృష్ణగా కనిపించనున్న హీరో వెంకటేశ్ పాత్ర చిత్రణ నవ్వులు పూయిస్తుందని సోమవారం విడుదల చేసిన టీజర్ ద్వారా మారుతి చిన్న హింట్ ఇచ్చేశారు.
ఈ పన్నెండేళ్ల కాలంలో ‘ఘర్షణ’, ‘ఈనాడు’ చిత్రాల తర్వాత వెంకటేశ్ పోలీస్‌గా కనిపించనున్న చిత్రం ఇదే. ‘బొబ్బిలి రాజా’లో వెంకటేశ్ సిగ్నేచర్ డైలాగ్ ‘అయ్యో అయ్యో అయ్యయ్యో...’ను మళ్లీ ఈ సినిమాలో ఉపయోగించి, ఫ్యాన్స్‌కు మంచి కిక్ ఇచ్చారు.
మారుతి దర్శకత్వంలో ఎస్. రాధాకృష్ణ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నయనతార కథానాయిక. త్వరలోనే పాటలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.