
ఇంటికి చేరిన విద్యాబాలన్
ముంబయి: బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ ఆస్పత్రి నుంచి శుక్రవారం డిశ్చార్జ్ అయ్యారు. కిడ్నీ సంబంధింత సమస్యతో ఆమె ముంబయిలోని హిందుజా ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. శుక్రవారం విద్యా బాలన్ 37వ పుట్టిన రోజు కూడా కావడంతో తన అభిమానులకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 'నా పుట్టిన రోజునాడే తిరిగి ఇంటికి చేరుకోవడం ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరికి 2016 సంవత్సర శుభాకాంక్షలు' అంటూ ట్విట్టర్ ద్వారా తెలిపారు.
కాగా, విద్యాబాలన్ న్యూ ఇయర్ వేడుకలతో పాటు, తన పుట్టినరోజును భర్త సిద్ధార్థ రాయ్ కపూర్తో కలిసి అబ్రాడ్లో జరుపుకునేందుకు ప్లాన్ చేసింది. అయితే విద్యాబాలన్ ఆరోగ్యం బాగోలేకపోవడంతో ఆ టూర్ను అర్థాంతరంగా క్యాన్సిల్ చేసుకున్నారు.
Grateful to be back home in time to bring in my birthday ...Thank You for all your love,prayers and wishes🙏. Happy 2016 to each of you💃🏻🎁!!
— vidya balan (@vidya_balan) December 31, 2015