రచయితలూ మేమూ మారాలి | Vijay Antony's Bethaludu Movie Audio Launch | Sakshi
Sakshi News home page

రచయితలూ మేమూ మారాలి

Published Mon, Nov 7 2016 12:13 AM | Last Updated on Mon, Sep 4 2017 7:23 PM

రచయితలూ మేమూ మారాలి

రచయితలూ మేమూ మారాలి

 - బోయపాటి శ్రీను
 ‘‘తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా సెటిల్డ్ పెర్‌ఫార్మ్ చేసే కథానాయకులున్నారు. అయితే రచయితలు, దర్శకులమైన మేము మారాల్సి ఉంది. సినిమా అన్నది స్టేజ్‌పై మాట్లాడకూడదు. స్క్రీన్‌పైనే మాట్లాడాలని నేను నమ్ముతా. అలా తెరపై మాట్లాడిన చిత్రం ‘బిచ్చగాడు’. అదే తరహాలో విజయ్ ఆంటోని ‘భేతాళుడు’ కూడా హిట్ అవ్వాలి’’ అని దర్శకుడు బోయపాటి శ్రీను అన్నారు. విజయ్ ఆంటోని, అరుంధతీ నాయర్ జంటగా ప్రదీప్ కృష్ణమూర్తి దర్శకత్వంలో తమిళంలో తెరకెక్కిన ‘సైతాన్’ చిత్రాన్ని కె.రోహిత్, ఎస్.వేణుగోపాల్ తెలుగులోకి ‘భేతాళుడు’ పేరుతో విడుదల చేస్తున్నారు. విజయ్ ఆంటోని స్వరపరచిన ఈ చిత్రం పాటలను హీరో నిఖిల్ విడుదల చేశారు. విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ-‘‘తెలుగులో నాకు ఇటువంటి గుర్తింపు ఏ పాతిక చిత్రాలకో వస్తుందనుకున్నా. కానీ, మూడో సినిమాకే ఇంత మంచి గుర్తింపు రావడం సంతోషంగా ఉంది’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement