
విజయ్ దేవరకొండ
స్టెతస్కోప్ పట్టుకున్న చేతులు ఇప్పుడు స్టీరింగ్ పట్టుకున్నాయి. డాక్టర్ నుంచి డ్రైవర్‌గా గేరు మార్చాడు విజయ్ దేవరకొండ. టాక్సీ తిప్పుతూ డ్రైవర్‌లాగా మారారు. నూతన దర్శకుడు రాహుల్ సంక్రిత్యన్ డైరెక్షన్‌లో విజయ్ దేవరకొండ, ప్రియాంకా జవల్కర్ హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘టాక్సీవాలా’.
యువీ క్రియేషన్స్, జీఏ2 బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం టైటిల్ టీజర్ వీడియోను ‘ఫస్ట్ గేర్’ పేరుతో రిలీజ్ చేశారు. మే 18న విడుదల కానున్న ఈ సినిమాకు సంగీతం: జాక్స్ బీజోయ్, కెమెరా: సుజిత్ సరంగ్, స్క్రీన్ ప్లే–డైలాగ్స్: సాయికుమార్ రెడ్డి, ప్రొడ్యూసర్: ఎస్.కె.యన్.
Comments
Please login to add a commentAdd a comment