
విజయ్ సేతుపతి
విలక్షణమైన సినిమాలు, పాత్రలు, నటనతో అన్ని ఇండస్ట్రీల దృష్టిని ఆకర్షిస్తున్న తమిళ నటుడు విజయ్ సేతుపతి. తన ప్రతీ సినిమాతోనూ ప్రేక్షకులను ఏదో విధంగా ఆశ్చర్యపరుస్తున్నారాయన. ప్రస్తుతం అల్లు అర్జున్–సుకుమార్ సినిమా, వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’, తమిళ సూపర్‌స్టార్ విజయ్ సినిమాల్లో కీలక పాత్రలు చేస్తున్నారాయన. అలాగే హిందీ వైపు కూడా వెళుతున్నారు. ఆమిర్‌ఖాన్ టైటిల్ రోల్ చేస్తున్న ‘లాల్‌సింగ్ చద్దా’లో విజయ్ సేతుపతి ఓ ప్రత్యేక పాత్ర చేస్తున్నారు. ఈ పాత్ర కోసం సుమారు 25కిలోలు తగ్గనున్నారని టాక్. ఈ సినిమాలో సేతుపతి, ఆమిర్ మిలటరీ జవానులుగా కనిపిస్తారట. ఈ పాత్రలో ఫిట్‌గా కనిపించడానికే ఈ బరువు తగ్గడం. ఆల్రెడీ అమిర్ 20 కిలోలు తగ్గిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment