మా ఐరా విద్యా మంచు: విష్ణు | Viranica Manchu Shares Adorable Pics Of Her Children | Sakshi
Sakshi News home page

మా ఐరా విద్యా మంచు: విరానికా

Published Sat, Aug 31 2019 11:32 AM | Last Updated on Sat, Aug 31 2019 2:34 PM

Viranica Manchu Shares Adorable Pics Of Her Children - Sakshi

‘మా ఐరా విద్యా మంచు’ అంటూ మంచు విష్ణు సతీమణి  విరానికా ట్విటర్‌లో షేర్‌ చేసిన ఫొటోలు అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. మంచు విష్ణు దంపతులు ఇటీవలే ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె పేరును ఐరా విద్యాగా పేర్కొన్న విష్ణు.. తనకు మీ ప్రేమ, ఆశీర్వాదాలు కావాలంటూ బుజ్జాయి ఫొటోలు ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఇక సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే విరానికా కూడా.. తాజాగా తమ నలుగురు పిల్లలు ఒకేచోట ఉన్న ఫొటోలను పోస్ట్‌ చేశారు. దీంతో..‘మీ చిన్నారులంతా చాలా క్యూట్‌గా ఉన్నారు’ అంటూ ట్విటర్‌ వేదికగా అభిమానులు వారికి ఆశీర్వాదాలు తెలుపుతున్నారు. 

కాగా విష్ణు దంపతులకు ఇప్పటికే ముగ్గురు పిల్లలు వివియానా, అరియానా, అవ్రామ్‌లు ఉన్న విషయం తెలిసిందే. వీరిలో అరియానా, వివియానా కవలలు. ఆగస్టు 9న మూడో ఆడబిడ్డకు విరానికా జన్మనిచ్చారు. ఆమెకు ఐరావిద్యాగా నామకరణం చేశారు. ఇక కెరీర్‌ పరంగా మంచు విష్ణు ఓటర్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement