విరానిక మంచు,మంచు విష్ణు
మంచు కుటుంబంలోకి మరో చిన్నారి రాకకు సమయం దగ్గరపడుతోంది. హీరో మంచు విష్ణు మరోసారి తండ్రి కాబోతున్నారు. ‘‘స్పెషల్ లొకేషన్ నుంచి స్పెషల్ అనౌన్స్‌మెంట్ ఇస్తున్నాం. ఇప్పుడు మేమున్నది విన్నీ (విష్ణు భార్య విరానిక) స్వస్థలం (న్యూయార్క్). ఇది విన్నీ ఫేవరెట్ ప్లేస్. అరియానా, వివియానా, అవ్రామ్‌లకు తోడుగా ఫోర్త్ లిటిల్ ఏంజిల్ మా జీవితంలోకి వచ్చే సమయం దగ్గరపడిందని తెలియజేయడానికి ఆనందంగా ఉంది’’ అని మంచు విష్ణు ట్వీట్ చేశారు. ‘‘మంచు కుటుంబంలోకి మరొకరు వస్తున్నారు. ప్లస్ వన్. ప్రపంచంలోనే అత్యంత అందమైన అనుభూతిని అనుభవిస్తున్నాను. రాబోయే చిన్నారిని కలుసుకోవడానికి మేమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం’’ అని విరానిక మంచు పేర్కొన్నారు. మంచు విష్ణు, విరానికల వివాహం 2009లో జరిగింది. ఈ దంపతులకు కవల కుమార్తెలు అరియానా, వివియానా, కుమారుడు అవ్రామ్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment