ఉతికి ఆరేశారు.. వెల్ డన్ | what will they say about pitch now, asks amitabh bachchan | Sakshi
Sakshi News home page

ఉతికి ఆరేశారు.. వెల్ డన్

Published Mon, Dec 7 2015 3:31 PM | Last Updated on Sun, Sep 3 2017 1:38 PM

ఉతికి ఆరేశారు.. వెల్ డన్

ఉతికి ఆరేశారు.. వెల్ డన్

ప్రపంచ నెంబర్ వన్ జట్టుపై టెస్టు సిరీస్‌లో 3-0 తేడాతో టీమిండియా విజయం సాధించడంతో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఎంతగానో పొంగిపోయారు. కోల్‌కతాకు ఓ షూటింగ్ నిమిత్తం వచ్చిన ఆయన.. అక్కడ హోటల్ రూంలోని టీవీలో మ్యాచ్ చూస్తూ.. భారత్ విజయం సాధించగానే 3-0 తేడాతో మనోళ్లు గెలిచేశారంటూ ట్వీట్ చేశారు. ఉతికి ఆరేశారంటూ ప్రశంసల్లో ముంచెత్తారు.

వెల్ డన్ ఇండియా, వెల్ డన్ టీమ్, వెల్ డన్ విరాట్ అంటూ ప్రత్యేకంగా అందరినీ అభినందించారు. ఇక పిచ్ విషయంలో విరాట్ నిర్ణయం చూసి తాను చాలా ఆనందపడ్డానని, ఇప్పుడు వాళ్లు పిచ్ గురించి ఏమంటారని ప్రశ్నించారు. ఎప్పుడూ ఇలాగే దృఢంగా, నిర్భయంగా ఉండాలని, తన అండదండలు ఎప్పుడూ ఉంటాయంటూ విరాట్ కోహ్లీకి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు బిగ్ బీ.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement