india wins test series
-
IND vs ENG 3rd ODI: పంత్ ధమాకా...
భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంటే... సిరాజ్ టాప్ లేపాడు. హార్దిక్ పాండ్యా మిడిలార్డర్‌ను కట్టడి చేశాడు. బ్యాటింగ్ పిచ్‌పై ఆతిథ్య జట్టు 259 పరుగులకే ఆలౌట్! ఇక్కడిదాకా బాగానే ఉంది. కానీ ఛేదన మొదలవగానే బ్యాటింగ్ కష్టాలు ఎదురయ్యాయి. భారత టాపార్డర్ (రోహిత్ 17, ధావన్ 1, కోహ్లి 17) చేసిన పరుగులు 35. విజయంపై ఆశల్లేని ఈ దశలో రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా భాగస్వామ్యం భారత్‌ను గెలుపు మలుపు తిప్పింది. పంత్ అజేయ శతకం సిరీస్ విజయాన్నిచ్చింది. మాంచెస్టర్: వన్డే సిరీస్ కూడా 2–1తో భారత్ చేతికే చిక్కింది. మూడో వన్డేలో రోహిత్ శర్మ బృందం ఐదు వికెట్లతో ఇంగ్లండ్‌పై నెగ్గింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట ఇంగ్లండ్ 45.5 ఓవర్లలో 259 పరుగుల వద్ద ఆలౌటైంది. బట్లర్ (80 బంతుల్లో 60; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), జేసన్ రాయ్ (31 బంతుల్లో 41; 7 ఫోర్లు) రాణించారు. హార్దిక్ పాండ్యా (4/24) వన్డే కెరీర్లో అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేయగా... చహల్ మూడు, సిరాజ్ రెండు వికెట్లు తీశారు. అనంతరం భారత్ 42.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 261 పరుగులు చేసి గెలిచింది. రిషభ్ పంత్ (113 బంతుల్లో 125 నాటౌట్; 16 ఫోర్లు, 2 సిక్స్‌లు) గెలిపించేదాకా క్రీజులోనే నిలిచాడు. హార్దిక్ పాండ్యా (55 బంతుల్లో 71; 10 ఫోర్లు) ధాటిగా ఆడాడు. పంత్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ... హార్దిక్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి. రాణించిన బట్లర్, రాయ్ వరుస బౌండరీలతో మొదలైన ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌కు ఆదిలోనే సిరాజ్ అడ్డుకట్ట వేశాడు. షమీ తొలి ఓవర్లోనే రాయ్ 3 ఫోర్లు బాదాడు. రెండో ఓవర్ వేసిన సిరాజ్ పరుగైన ఇవ్వకుండా బెయిర్‌స్టో (0), రూట్ (0)లను డకౌట్ చేశాడు. దీంతో రాయ్, స్టోక్స్ (29 బంతుల్లో 27; 4 ఫోర్లు) అడపాదడపా బౌండరీలతో స్కోరు పెంచారు. అయితే హార్దిక్ వీరిద్దరిని స్వల్ప వ్యవధిలో పెవిలియన్ పంపాడు. మొయిన్ అలీ (44 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) అండతో కెప్టెన్ బట్లర్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం లివింగ్‌స్టోన్ (31 బంతుల్లో 27; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఓవర్టన్ (33 బంతుల్లో 33; 1 ఫోర్, 1 సిక్స్) మెరుగ్గా ఆడటంతో ఇంగ్లండ్ పోరాడే లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచింది. పంత్ వీరోచితం ఓపెనర్లు ధావన్ (1), రోహిత్ (17) సహా కోహ్లి (17)లను రీస్ టాప్లీ పడగొట్టేశాడు. భారత్ స్కోరు 38/3. సూర్యకుమార్ (16) కూడా తక్కువ స్కోరుకే అవుటయ్యాడు. 16.2 ఓవర్లలో 72 పరుగులకే కీలకమైన 4 వికెట్లు కూలాయి. ఇంకా బోలెడు ఓవర్లున్నా... పెద్ద లక్ష్యం... కానీ చేతిలో ఉన్న 6 వికెట్లలో బ్యాటర్స్ ముగ్గురే! ఇక గెలుపే కష్టమనుకున్న దశలో నింపాదిగా ఆడుతున్న పంత్‌కు జతయిన హార్దిక్ ధాటిగా ఆడాడు. ఈ క్రమంలోనే పాండ్యా 43 బంతుల్లో, పంత్ 71 బంతుల్లో ఫిఫ్టీలు పూర్తి చేసుకున్నారు. ఐదో వికెట్‌కు 133 పరుగుల భాగస్వామ్యం జోడించడంతో స్కోరు 200 దాటింది. కాసేపటికే పాండ్యా అవుటైనా... జడేజా (7 నాటౌట్) అండతో 106 బంతుల్లో (10 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ సాధించిన పంత్... విల్లే వేసిన 42వ ఓవర్లో వరుసగా 5 ఫోర్లు బాదాడు. ఆ తర్వాతి ఓవర్ తొలి బంతికే పంత్ మరో బౌండరీ కొట్టి భారత్‌ను విజయతీరానికి చేర్చాడు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) స్కోరు వివరాలు ఇంగ్లండ్ ఇన్నింగ్స్: రాయ్ (సి) పంత్ (బి) పాండ్యా 41; బెయిర్‌స్టో (సి) అయ్యర్ (సబ్) (బి) సిరాజ్ 0; రూట్ (సి) రోహిత్ (బి) సిరాజ్ 0; స్టోక్స్ (సి అండ్ బి) పాండ్యా 27; బట్లర్ (సి) జడేజా (బి) పాండ్యా 60; అలీ (సి) పంత్ (బి) జడేజా 34; లివింగ్‌స్టోన్ (సి) జడేజా (బి) పాండ్యా 27; విల్లే (సి) సూర్యకుమార్ (బి) చహల్ 18; ఓవర్టన్ (సి) కోహ్లి (బి) చహల్ 32; కార్స్ (నాటౌట్) 3; టాప్లీ (బి) చహల్ 0; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (45.5 ఓవర్లలో ఆలౌట్) 259. వికెట్ల పతనం: 1–12, 2–12, 3–66, 4–74, 5–149, 6–198, 7–199, 8–247, 9–257, 10–259. బౌలింగ్: షమీ 7–0–38–0, సిరాజ్ 9–1–66–2, ప్రసిధ్‌కృష్ణ 9–0–48–0, హార్దిక్ పాండ్యా 7–3–24–4, చహల్ 9.5–0–60–3, జడేజా 4–0–21–1. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) రూట్ (బి) టాప్లీ 17; ధావన్ (సి) రాయ్ (బి) టాప్లీ 1; కోహ్లి (సి) బట్లర్ (బి) టాప్లీ 17; పంత్ (నాటౌట్) 125; సూర్యకుమార్ (సి)బట్లర్ (బి) ఓవర్టన్ 16; పాండ్యా (సి) స్టోక్స్ (బి) కార్స్ 71; జడేజా (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (42.1 ఓవర్లలో 5 వికెట్లకు) 261. వికెట్ల పతనం: 1–13, 2–21, 3–38, 4–72, 5–205. బౌలింగ్: టాప్లీ 7–1–35–3, విల్లే 7–0–58–0, కార్స్ 8–0–45–1, అలీ 8–0–33–0, ఓవర్టన్ 8–0–54–1, స్టోక్స్ 2–0–14–0, లివింగ్‌స్టోన్ 2–0–14–0, రూట్ 0.1–0–4–0. -
తొలి టీ20లో భారత్ విజయం
-
జోరు మనదే
154 స్కోరుకు, 159 స్కోరుకు మధ్య తేడా ఐదు పరుగులే! కానీ వికెట్ల పతనం డబుల్ అయింది. ఈ డబుల్ ధమాకా భువనేశ్వర్‌ది. మొదటి స్కోరు వద్ద నాలుగు వికెట్లతో ఉన్న సఫారీ జట్టు రెండో స్కోరుకల్లా మరో నాలుగు వికెట్లను చేజార్చుకుంది. అంతలా... భువీ దెబ్బతీశాడు. కాదు కాదు... దెబ్బ మీద దెబ్బ తీశాడు. వన్డేల్లో ఆధిపత్యాన్ని కొనసాగించిన కోహ్లి సేన... తాజాగా టి20ల్లోనూ శుభారంభం చేసింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. జొహన్నెస్‌బర్గ్: ధావన్ ధనాధన్ పరుగులు, భువనేశ్వర్ ఫటాఫట్ వికెట్లు సఫారీని కుదిపేశాయి. శిఖర్ ఇన్నింగ్స్ భారీ స్కోరుకు బాట వేస్తే, భువీ బౌలింగ్ ప్రత్యర్థిని ఉన్నపళంగా కూల్చేసింది. పటిష్టస్థితి నుంచి పరాజయానికి పడేసింది. దీంతో తొలి టి20లో భారత్ 28 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 203 పరుగుల భారీస్కోరు చేసింది. ధావన్ (39 బంతుల్లో 72; 10 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగాడు. అనంతరం సఫారీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. హెన్డ్రిక్స్ (50 బంతుల్లో 70; 8 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ భువనేశ్వర్ (5/24) నిప్పులు చెరిగాడు. రెండో టి20 మ్యాచ్ బుధవారం జరుగుతుంది. మోకాలి గాయంతో దక్షిణాఫ్రికా స్టార్ ఏబీ డివిలియర్స్ ఈ సిరీస్‌కు దూరం కాగా... చేతి వేలి గాయంతో ఈ మ్యాచ్‌లో కుల్దీప్ యాదవ్ ఆడలేదు. సిక్స్‌లతో మొదలైంది... మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఇన్నింగ్స్‌కు సిక్సర్లతో శ్రీకారం చుట్టాడు రోహిత్ శర్మ. ప్యాటర్సన్ వేసిన తొలి ఓవర్లో రెండు సిక్స్‌లు, ఒక ఫోర్ బాదడంతో 18 పరుగులు వచ్చాయి. అయితే ఇదెంతో సేపు సాగలేదు. మరుసటి ఓవర్లోనే రోహిత్ (9 బంతుల్లో 21; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు ముగిశాయి. డాలా బౌలింగ్‌లో కీపర్ క్లాసెన్ క్యాచ్‌తో వెనుదిరిగాడు. ఏడాది తర్వాత బరిలోకి దిగిన రైనా (7 బంతుల్లో 15; 2 ఫోర్లు, 1 సిక్స్) కూడా ధాటిగా ఆడే ప్రయత్నంలోనే నిష్క్రమించాడు. ఈ దశలో ధావన్, కోహ్లి జోరు కొనసాగించారు. షమ్సీ వేసిన ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్ తొలిబంతికి లాంగాన్‌లో బెహర్దీన్ క్యాచ్ చేజార్చడంతో బతికిపోయిన కోహ్లి (20 బంతుల్లో 26; 2 ఫోర్లు, 1 సిక్స్)... ఆ ఓవర్లో ఫోర్, భారీ సిక్సర్ బాదాడు. అయితే షమ్సీ వేసిన మరుసటి ఓవర్లో భారత కెప్టెన్ వికెట్ల ముందు దొరికిపోయాడు. అనంతరం మనీశ్ పాండే, ధోని, పాండ్యా రాణించడంతో భారత స్కోరు 200 పరుగులు దాటింది. రాణించిన హెన్డ్రిక్స్... కష్టసాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌కు ఓపెనర్ హెన్డ్రిక్స్ వెన్నెముకగా నిలిచాడు. టాపార్డర్ విఫలమైనా... బెహర్దీన్ (27 బంతుల్లో 39; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో కలిసి హెన్డ్రిక్స్ గట్టెక్కించే ప్రయత్నం చేసినా భువనేశ్వర్ దెబ్బకు సాధ్యపడలేదు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) క్లాసెన్ (బి) డాలా 21; ధావన్ (సి) క్లాసెన్ (బి) ఫెలుక్వాయో 72; రైనా (సి అండ్ బి) డాలా 15; కోహ్లి ఎల్బీడబ్ల్యూ (బి) షమ్సీ 26; పాండే (నాటౌట్) 29; ధోని (బి) మోరిస్ 16; పాండ్యా (నాటౌట్) 13; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 203. వికెట్ల పతనం: 1–23, 2–49, 3–108, 4–155, 5–183. బౌలింగ్: ప్యాటర్సన్ 4–0–48–0, డాలా 4–0–47–2, మోరిస్ 4–0–39–1, షమ్సీ 4–0–37–1, స్మట్స్ 2–0–14–0, ఫెలుక్వాయో 2–0–16–1. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: స్మట్స్ (సి) ధావన్ (బి) భువనేశ్వర్ 14; హెన్డ్రిక్స్ (సి) ధోని (బి) భువనేశ్వర్ 70; డుమిని (సి) రైనా (బి) భువనేశ్వర్ 3; మిల్లర్ (సి) ధావన్ (బి) పాండ్యా 9; బెహర్దీన్ (సి) పాండే (బి) చహల్ 39; క్లాసెన్ (సి) రైనా (బి) భువనేశ్వర్ 16; ఫెలుక్వాయో (సి) చహల్ (బి) ఉనాద్కట్ 13; మోరిస్ (సి) రైనా (బి) భువనేశ్వర్ 0; ప్యాటర్సన్ (రనౌట్) 1; డాలా (నాటౌట్) 2; షమ్సీ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 175. వికెట్ల పతనం: 1–29, 2–38, 3–48, 4–129, 5–154, 6–158, 7–158, 8–159, 9–175. బౌలింగ్: భువనేశ్వర్ 4–0–24–5, ఉనాద్కట్ 4–0–33–1, బుమ్రా 4–0–32–0, హార్దిక్ పాండ్యా 4–0–45–1, యజువేంద్ర చహల్ 4–0–39–1. 5 భారత్ తరఫున టి20ల్లో 5 వికెట్లు తీసిన తొలి పేసర్ భువనేశ్వర్. 78 పవర్‌ప్లేలో టీమిండియా చేసిన పరుగులు. భారత్‌కిదే అత్యధికం. 203 దక్షిణాఫ్రికాపై భారత్ సాధించిన అత్యధిక స్కోరు. 1 కేవలం 8.2 ఓవర్లలోనే భారత్ 100 కొట్టడం ఇదే తొలిసారి. 12 పుష్కర కాలం క్రితం భారత్ తొలి అంతర్జాతీయ టి20 ఆడింది ఇక్కడే. అప్పటి జట్టులో ఆడినవారిలో ధోని, రైనా ఇప్పుడు ఆడారు. -
ఉతికి ఆరేశారు.. వెల్ డన్
ప్రపంచ నెంబర్ వన్ జట్టుపై టెస్టు సిరీస్‌లో 3-0 తేడాతో టీమిండియా విజయం సాధించడంతో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఎంతగానో పొంగిపోయారు. కోల్‌కతాకు ఓ షూటింగ్ నిమిత్తం వచ్చిన ఆయన.. అక్కడ హోటల్ రూంలోని టీవీలో మ్యాచ్ చూస్తూ.. భారత్ విజయం సాధించగానే 3-0 తేడాతో మనోళ్లు గెలిచేశారంటూ ట్వీట్ చేశారు. ఉతికి ఆరేశారంటూ ప్రశంసల్లో ముంచెత్తారు. వెల్ డన్ ఇండియా, వెల్ డన్ టీమ్, వెల్ డన్ విరాట్ అంటూ ప్రత్యేకంగా అందరినీ అభినందించారు. ఇక పిచ్ విషయంలో విరాట్ నిర్ణయం చూసి తాను చాలా ఆనందపడ్డానని, ఇప్పుడు వాళ్లు పిచ్ గురించి ఏమంటారని ప్రశ్నించారు. ఎప్పుడూ ఇలాగే దృఢంగా, నిర్భయంగా ఉండాలని, తన అండదండలు ఎప్పుడూ ఉంటాయంటూ విరాట్ కోహ్లీకి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు బిగ్ బీ. T 2083 - INDIA WINS !!! YEAAAHH ! Test cricket .. India beats SoAf 3-0 !! Proud of Indian Team and Virat .. Many many Congratulations !! — Amitabh Bachchan (@SrBachchan) December 7, 2015 T 2083 - INDIA WINS !! 3-0 .. Dho daala !! Against No 1 team in world, South Africa !! Well done India ! Well done team ! Well done VIRAT ! — Amitabh Bachchan (@SrBachchan) December 7, 2015 T 2083 - VIRAT !! loved your stand about PITCH from last game .. aaj PITCH ke baare mei kya bolenge ?? Remain tough and strong ! With you ! — Amitabh Bachchan (@SrBachchan) December 7, 2015