‘వేర్‌ ఈజ్‌ ది వెంకటలక్ష్మీ’ ఫస్ట్‌ లుక్‌ | Where Is The Venkatalakshmi First Look Poster | Sakshi
Sakshi News home page

Published Sun, Nov 4 2018 12:45 PM | Last Updated on Sun, Nov 4 2018 4:23 PM

Where Is The Venkatalakshmi First Look Poster - Sakshi

ఏబీటీ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం.1 లో తెర‌కెక్కుతున్న చిత్రం ‘వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి’. రాయ్‌ లక్ష్మీ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో రామ్ కార్తిక్ హీరోగా న‌టిస్తున్నాడు. పూజిత పొన్నాడ మ‌రో హీరోయిన్ గా న‌టిస్తున్నారు. కామెడీ థ్రిల్లర్‌ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను యంగ్ హీరో నితిన్‌ సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు.

రాయ్‌ లక్ష్మీ, పూజితా పోన్నాడలను రివీల్‌ చేస్తూ రూపొందించిన ఈ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ ఆసక్తికరంగా ఉంది. పోస్టర్‌ డిజైన్‌లోనే సినిమా థ్రిల్లర్‌గా తెరకెక్కుతోందన్న విషయాన్ని రివీల్‌ చేశారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈసినిమా రిలీజ్‌ డేట్‌ను త్వరలో వెల్లడించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement