వ్యూస్‌ కోసం అలా రాస్తారా : హీరోయిన్‌ | Raai Laxmi Reacted to The Rumours of Her Being Pregnant | Sakshi
Sakshi News home page

వ్యూస్‌ కోసం అలా రాస్తారా : హీరోయిన్‌

Published Wed, Feb 27 2019 4:13 PM | Last Updated on Wed, Feb 27 2019 4:13 PM

Raai Laxmi Reacted to The Rumours of Her Being Pregnant - Sakshi

తెలుగు, హిందీ, తమిళ సినిమాల్లో బిజీ ఉన్న నటి రాయ్‌ లక్ష్మీ. హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించినా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోవటంతో ప్రస్తుతం స్పెషల్‌ సాంగ్స్‌, క్యారెక్టర్‌ రోల్స్‌ తో కెరీర్‌ లాగించేస్తోంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ భామ తెలుగులో వేర్‌ ఈజ్‌ ది వెంకటలక్ష్మీ సినిమాతో పాటు తమిళ, హిందీ సినిమాల్లో నటిస్తోంది. అయితే తాజా రాయ్‌ లక్ష్మీ సంబంధించిన ఓ వార్త వైరల్ కావటంతో ఆమె తీవ్రంగా స్పందించింది.

ఓ తమిళ వెబ్‌ సైట్‌ రాయ్‌ లక్ష్మీ తల్లి కాబోతుందా అంటూ ఓ వార్తను ప్రచురించింది. ఈ వార్తపై స్పదించిన ఆమె.. కేవలం వ్యూస్‌ కోసం ఇలా ఆధారాలు లేకుండా ఏ వార్త అయినా రాసేస్తారా..? తప్పును కూడా ఇంత ధైర్యంగా ఎలా చేస్తారు? ఈ వార్త రాసిన వ్యక్తికి నేను అస్సలు ఇష్టం లేదనుకుంటా. ఇంతకన్నా మంచి కథలు కావాలంటే నన్ను అడగండి అంటూ సోషల్ మీడియా వేదికగా ఫైర్‌ అయ్యింది రాయ్‌ లక్ష్మీ. ఈ భామ ప్రధాన పాత్రలో తెరకెక్కిన వేర్‌ ఈజ్‌ ది వెంకటలక్ష్మీ మార్చి 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement