
పగిలిన ఫోన్‌ను చూపిస్తున్న బాలుడి తల్లి
సాక్షి, హైదరాబాద్: స్టార్ యాంకర్, టాలీవుడ్ నటి అనసూయ భరద్వాజ్‌పై ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనసూయ తన కుమారుడి ఫోన్ పగలగొట్టిందని, దుర్భాషలాడిందని బాధిత బాలుడి తల్లి ఉస్మానియా యూనివర్శిటీ పరిధిలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనసూయపై చర్యలు తీసుకోవాలని ఆ మహిళ పోలీసులకు విజ్ఞప్తి చేశారు.
వివరాల్లోకెళ్తే.. జబర్ధస్త్ యాంకర్ అనసూయ ఇటీవల ఏదో పని నిమిత్తం నగరంలోని తార్నాక ప్రాంతానికి వెళ్లారు. తన తల్లితో కలిసి అటుగా వెళుతున్న ఓ బాలుడు రోడ్డు పక్కన అనసూయ కనిపించగానే ఆమె వద్దకు వెళ్లాడు. అభిమానంతో ఆమెతో సెల్పీ తీసుకోవాలనుకున్నాడు. వెంటనే తన మొబైల్ తీసి ఫొటో తీసుకునేందుకు యత్నించగా.. ఇది గమనించిన నటి అనసూయ ఆవేశానికి లోనై బాలుడి ఫోన్‌ను లాక్కుని నేలకేసి కొట్టారు. దీంతో ఆ తల్లీకొడుకు బిత్తరపోయారు. తేరుకున్న బాలుడి తల్లి తన కొడుకు ఫోన్ ఎందుకు పగలగొట్టావంటూ ప్రశ్నించగా.. సమాధానం చెప్పని అనసూయ దుర్భాషలాడుతూ కారు అక్కడినుంచి వెళ్లిపోయారు. దీంతో ఆ మహిళ ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment