నా కూతురు సినిమాల్లోకి వస్తానంటే సంతోషమే: అమీర్ | Would be happy if my daughter joins film industry: Aamir Khan | Sakshi
Sakshi News home page

నా కూతురు సినిమాల్లోకి వస్తానంటే సంతోషమే: అమీర్

Published Sat, Dec 14 2013 1:22 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

నా కూతురు సినిమాల్లోకి వస్తానంటే సంతోషమే: అమీర్ - Sakshi

నా కూతురు సినిమాల్లోకి వస్తానంటే సంతోషమే: అమీర్

సినీ పరిశ్రమలో స్టార్ హీరోల పిల్లల్లో ఎక్కువ మంది అబ్బాయిలే వారసులుగా కనిపిస్తారు. అమ్మాయిలను సినిరంగంలో ఎంకరేజ్ చేయడం చాలా అరుదుగా కనిపిస్తుంది. సిని పరిశ్రమలోని ట్రెండ్ కు విరుద్దంగా మిస్టర్ ఫర్ ఫెక్ట్ అమీర్ ఖాన్ అడుగులేస్తున్నాడు. తన కూతురు బాలీవుడ్ ను కెరీర్ గా ఎంచుకుంటే తాను ఎక్కువ సంతోషపడుతాను అని అమీర్ అన్నారు. తన పిల్లలపై తన ప్రభావం ఉండేలా ఆంక్షలు ఉండవు అని అమీర్ స్పష్టం చేశారు. సినిమాలను కెరీర్ గా ఎంచుకోవడానికి తనకు ఇష్టం ఉందో లేదో తనకు తెలియదని, అయితే తననే అడిగి తెలుసుకోవాలని అమీర్ సూచించారు. 
 
ప్రస్తుతం కుమారుడు జునైద్ దర్శకత్వ శాఖలో ప్రవేశించాడు. రాజు హిరాణీ దర్శకత్వంలో అమీర్ నటిస్తున్న 'పీకే' చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేస్తున్నాడు. అందరు డైరెక్టర్ల మాదిరిగానే తనను ఇంప్రెస్ చేస్తే తాను జునైద్ దర్శకత్వంలో పనిచేయడానికి సిద్దం అని అన్నారు. 
 
వాళ్లకు నచ్చిన పనిని చేయడం వాళ్ల ఇష్టం. పిల్లలపై తన నుంచి ఎలాంటి ఒత్తిడి ఉండదు అని అన్నారు. ఒకవేళ వాళ్లు సినిమాల్లోకి రావాలని కోరుకుంటే.. తాను, కిరణ్ కలిసి పనిచేస్తాం అని అమీర్ అన్నారు.  అమీర్ మొదటి భార్య రీనా రాయ్ కి ఇద్దరు పిల్లలు.  కుమారుడు జునైద్,  కుమార్తే ఇరా. రెండవ భార్య కిరణ్ రావుకు ఆజాద్ అనే కుమారుడు ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement