అర్జున్ రెడ్డిగా రాకింగ్ స్టార్..! | yash play kannada version arjun reddy | Sakshi
Sakshi News home page

అర్జున్ రెడ్డిగా రాకింగ్ స్టార్..!

Published Thu, Sep 14 2017 4:30 PM | Last Updated on Tue, Sep 19 2017 4:33 PM

అర్జున్ రెడ్డిగా రాకింగ్ స్టార్..!

అర్జున్ రెడ్డిగా రాకింగ్ స్టార్..!

టాలీవుడ్ లో సంచలన విజయం సాధించిన అర్జున్ రెడ్డి సినిమాను ఇతర భాషల్లో రీమేక్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా తమిళ రీమేక్ రైట్స్ ను హీరో ధనుష్ సొంతం చేసుకోగా బాలీవుడ్ నిర్మాతలతో చర్చలు జరుగుతున్నాయి. తాజాగా అర్జున్ రెడ్డి కన్నడ రైట్స్ కు అమ్ముడయ్యాయన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు త్వరలోనే కన్నడ వర్షన్ సెట్స్ మీదకు వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి.

అర్జున్ రెడ్డి కన్నడ రీమేక్ రైట్స్ ను సొంతం చేసుకున్న నిర్మాత రాక్ లైన్ వెంకటేష్, నటీనటులు సాంకేతిక నిపుణుల ఎంపికలో బిజీగా ఉన్నారు. ఇప్పటి వరకు ఎవరి పేరును అధికారికంగా ప్రకటించకపోయినా.. హీరోగా రాకింగ్ స్టార్ యష్ నటించే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. లుక్, యాటిట్యూడ్ విషయంలో విజయ్ దేవరకొండలాగే కనిపించే యష్ అర్జున్ రెడ్డి పాత్రకు పూర్తి న్యాయం చేయగలడని భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement