ఈ అబ్బాయిని గుర్తుపట్టారా?
బాలీవుడ్ రుస్తుం అక్షయ్ కుమార్ పక్కన బొద్దుగా కనబడుతూ బుద్ధిగా నుంచున్న బుడ్డోడ్ని గుర్తుపట్టారా? ఆ అబ్బాయి అప్పుడే కాదు.. ఇప్పటికీ అక్కీ ఫ్యానేనట. 18 ఏళ్ల క్రితం అక్షయ్, రవీనా టాండన్లు జంటగా నటించిన 'కీమత్' సినిమా షూటింగ్ సమయంలో తీసిన ఫొటో ఇది. అనుకోకుండా షూటింగ్ స్పాట్ కి వెళ్లిన ఆ కుర్రాడు.. అక్కడ హీరోయిన్ రవీనాను చూసి ఆశ్చర్యానికి గురయ్యాడట. కళ్లు చెదిరే మేని సోయగంతో మెరిసిపోతున్న ఆమె రూపాన్ని ఇప్పటికీ మర్చిపోలేనంటున్నాడు సదరు గడుగ్గాయి. అదేపనిగా గుడ్లప్పగించి ఆమెనే చూస్తుండటం గమనించిన రవీనా కాస్త ఇబ్బందిగా ఫీలయినట్లు కూడా గుర్తుందట.
అంతలో అక్కడకి అక్షయ్ రావడం, అతనితో ఫొటో దిగడం చకచకా జరిగిపోయాయి. హెయిర్ స్టైల్ బాగుందంటూ స్వయంగా అక్షయే ఆ కుర్రాడికి చెప్పారట. మొత్తానికి మొమరబుల్ ఫ్యాన్ మొమెంట్. అదే అందరితో పంచుకున్నాడు ఆ ఫొటోలోని బాలుడు.. ఇప్పటి బాలీవుడ్ బాజీరావ్ 'రణ్ వీర్ సింగ్'. అక్షయ్ తాజా చిత్రం రుస్తుం విడుదల కావడానికి ఇంకా 9 రోజులు ఉందంటూ ఈ ఫొటోని ట్విట్టర్ లో పోస్ట్ చేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు రణ్ వీర్ సింగ్.
PRICELESS #Throwback !!!
My Fanboy moment with the One & Only @akshaykumar !