
యువ నటుడు ప్రిన్స్
హీరోగా ఎంట్రీ తరువాత క్యారెక్టర్ రోల్స్ లోకు టర్న్ అయిన యువ నటుడు ఇప్పుడు సిక్స్ ప్యాక్ లుక్‌లో అదరగొడుతున్నాడు. క్రియేటివ్ డైరెక్టర్ తేజ దర్శకత్వంలో తెరకెక్కిన నీకు నాకు సినిమాతో హీరోగా పరిచయం అయిన యంగ్ హీరో ప్రిన్స్. తరువాత బస్‌స్టాప్, రొమాన్స్ విజయవంతమైన చిత్రాల్లో నటించినా.. హీరోగా ప్రిన్స్ కు కలిసి రాలేదు. దీంతో మల్టీ స్టారర్ సినిమాలతో పాటు క్యారెక్టర్ రోల్స్‌లోనూ కనిపించాడు. నేను శైలజ, మిస్టర్ సినిమాల్లో ప్రిన్స్ చేసిన పాత్రలకు మంచి గుర్తింపు వచ్చింది.
తెలుగు బిగ్ బాస్ కంటెస్టెంట్‌గా కూడా ప్రిన్స్ కు మంచి గుర్తింపు వచ్చింది. అయితే బిగ్ బాస్ షో తరువాత తిరిగి సినిమాల మీద దృష్టి పెట్టిన ప్రిన్స్ ఇప్పుడు న్యూ లుక్ లో షాక్ ఇచ్చాడు. ఇన్నాళ్లు చాక్లెట్ బాయ్ ల కనిపించిన ఈ యంగ్ హీరో ఇప్పుడు రఫ్ అండ్ టఫ్ గా సిక్స్ ప్యాక్ బాడీతో ఆకట్టుకుంటున్నాడు. అధికారికంగా ప్రకటించకపోయినా.. త్వరలో ప్రారంభం కానున్న సినిమా కోసమే ప్రిన్స్ ఇలా న్యూ లుక్ లోకి మారిపోయాడన్న టాక్ వినిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment